రోలర్‌ హాకీ పోటీల్లో జ్ఞానేశ్వర్‌కు బ్రాంజ్‌ మెడల్‌

ABN , First Publish Date - 2022-07-07T05:18:40+05:30 IST

ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో గత వారం జరిగిన అఖిల భారత్‌ అంతర విశ్వవిద్యాలయాల రోలర్‌ హాకీ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో గుంటూరు వైద్య కళాశాల 2కే18 బ్యాచ్‌కు చెందిన పెందుర్తి జ్ఞానేశ్వర్‌ బ్రాంజ్‌ మెడల్‌ సాధించారు.

రోలర్‌ హాకీ పోటీల్లో జ్ఞానేశ్వర్‌కు బ్రాంజ్‌ మెడల్‌
జ్ఞానేశ్వర్‌ను అభినందిస్తున్న ప్రిన్సిపాల్‌ తదితరులు

గుంటూరు(మెడికల్‌), జూలై 6: ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో  గత వారం జరిగిన అఖిల భారత్‌ అంతర విశ్వవిద్యాలయాల రోలర్‌ హాకీ ఛాంపియన్‌షిప్‌ పోటీల్లో గుంటూరు వైద్య కళాశాల 2కే18 బ్యాచ్‌కు చెందిన పెందుర్తి జ్ఞానేశ్వర్‌ బ్రాంజ్‌ మెడల్‌ సాధించారు. ఈ సందర్భంగా బుధవారం జీఎంసీ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సీహెచ్‌ పద్మావతి దేవి, వైస్‌ ప్రిన్సిపాల్‌ (అడ్మినిస్ట్రేషన్‌) డాక్టర్‌ బి.వెంకటేశ్వరరావు, వైస్‌ ప్రిన్సిపాల్‌ (అకడమిక్‌) డాక్టర్‌ కె.చంద్రకళ, స్పోర్ట్స్‌ కమిటీ మెంబర్‌ డాక్టర్‌ టి.భరత్‌, డాక్టర్‌ డీవీ సోమశేఖర్‌, ఫిజికల్‌ డైరెక్టర్‌ జె.రాము తదితరులు వైద్య విద్యార్థి జ్ఞానేశ్వర్‌ను అభినందించారు. 


Updated Date - 2022-07-07T05:18:40+05:30 IST