Abn logo
Sep 17 2021 @ 23:57PM

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం

తాండూరు రూరల్‌: జెండాను ఎగురవేస్తున్న బీజేపీ నాయకులు

తాండూరు రూరల్‌/బంట్వారం/కులకచర్ల/నవాబుపేట/దోమ/ధారూరు/కొడంగల్‌ రూరల్‌: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని శుక్రవారం బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తాండూరు మండలం జినుగుర్తి సమీపంలోని ఆర్టీసీ గేటు వద్ద బీజేపీ మండల అధ్యక్షుడు షేకాపురం ఆంజనేయులు జాతీయ జెండాను ఎగురవేశారు.  ఆయన మాట్లాడుతూ సర్దార్‌వల్లాభాయ్‌పటేల్‌ కృషి వల్లనే నిజాం రజాకర్లను తరిమికొట్టారని అన్నారు. కార్యక్రమంలో మండల బీజేపీ ఉపాధ్యక్షుడు గాళ్ల సిద్ధప్ప, చిరంజీవి, నాయకులు సూర్యకాంత్‌, విజయ్‌కుమార్‌, శ్రీకాంత్‌, ప్రవీణ్‌కుమార్‌, రవి పాల్గొన్నారు. అదేవిధంగా బంట్వారం మండల కేంద్రంతో పాటు   సల్బత్తాపూర్‌, బొపునారం, తొర్మామిడి తదితర గ్రామాల్లో బీజేపీ ఆధ్వర్యంలో జెండా ఎగురవేశారు. రిటైర్డ్‌ టీచర్‌ సాయన్న, లాల్‌రెడ్డి, పాల్గొన్నారు. కులకచర్ల చౌరస్తాలో జాట్‌ జిల్లా అధ్యక్షుడు రాఘవేందర్‌గౌడ్‌, బీజేపీ మండల అధ్యక్షుడు మైపాల్‌ జాతీయ జెండాను ఎగురవేసి జాతీయ గీతాన్ని ఆలపించారు. నవాబుపేటలో బీజేపీ నాయకులు శ్రీకాంత్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేసి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. దోమలోని మోత్కూర్‌, దొంగ ఎన్కెపల్లి, కొత్తపల్లి గ్రామాల్లో బీజేపీ నాయకులు మల్లేశ్‌, మైపాల్‌, గోపాల్‌, శ్రీశైలం, వెంకట్‌రాములు, బిచ్చయ్య జెండావిష్కరణలో పాల్గొన్నారు. ధారూరులో బీజేపీ నాయకులు రవీందర్‌ గౌడ్‌, రాజేందర్‌ గౌడ్‌, రమేశ్‌, జగన్‌ గౌడ్‌, కృష్ణ, అనిల్‌ గౌడ్‌, రాజు గౌడ్‌, శివ, జగన్‌ జాతీయ జెండాను ఎగురవేసి సర్దార్‌ వల్లాభాయ్‌పటేల్‌ చిత్రపటం వద్ద నివాళులర్పించారు.  కొడంగల్‌లో  సీపీఐ జిల్లా కార్యదర్శి ఇందనూర్‌బషీర్‌ జాతీయ జెండాలను ఎగరవేసేందుకు ప్రయత్నించగా పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ నాయకులు శ్యాంసుందర్‌, మూతులరాజు, సావిత్రమ్మ ఉన్నారు. సీపీఎం నాయకులు బుస్సచంద్రయ్య స్థానిక అంబేద్కర్‌ చౌరస్తాలో మాట్లాడారు. 

మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లాలో..

మేడ్చల్‌/కీసర/కీసర రూరల్‌/శామీర్‌పేట/మూడుచింతలపల్లి/ఘట్‌కేసర్‌: తెలంగాణ విమోచన దినోత్సవాన్ని శుక్రవారం మేడ్చల్‌లో బీజేపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మేడ్చల్‌ తహసీల్దార్‌ కార్యాలయంపై జెండా ఎగురవేసి నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఆంజనేయులు, అర్జున్‌, రాఘవరెడ్డి, వంశీ, తదితరులు ఉన్నారు. కీసరలో బీజేపీ మండలాధ్యక్షుడు దేశం మల్లే్‌షగౌడ్‌, ప్రధాన కార్యదర్శులు బాపురెడ్డి, బాల్‌రాజ్‌యాదవ్‌ ఆధ్వర్యంలో వల్లభాయ్‌ పటేల్‌ చిత్రపటం వద్ద నివాళులర్పించారు. అదేవిధంగా శామీర్‌పేట, మూడు చింతలపల్లి మండలాలు, తూంకుంట మున్సిపాలిటీలోని గ్రామా ల్లో విమోచన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. బీజేపీ శామీర్‌పేట మండలాధ్యక్షుడు కైర యాదగిరి ఆధ్వర్యంలో అలియాబాద్‌ చౌరస్తా వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వంగరి హృదయ్‌కుమార్‌, నాయకులు అశోక్‌, బోయిని శివ, నర్సింగ్‌రావు, లక్ష్మణ్‌, భాస్కర్‌, బాలకృష్ణ, కుమార్‌, మహ్మద్‌ పాషా, సుభాష్‌ ఉన్నారు. బీజేపీ దమ్మాయిగూడ మున్సిపాలిటీ అధ్యక్షుడు నాగమల్లారెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లా అధికార ప్రతినిధి గాలి సంపత్‌, కార్యవర్గ సభ్యులు మాదాసు ప్రశాంత్‌, కంది సునీల్‌చారి, సుజాతనాయక్‌, సాహితీ, పద్మావతి, బలరాంసింగ్‌ ఉన్నారు. అదేవిధంగా ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి కల్లూరి జయచంద్ర ఆధ్వర్యంలో పోచారం మున్సిపాలిటీలోని కేఎల్‌ మహేంద్రనగర్‌లో ఎర్రజెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో లొట్టి ఈశ్వర్‌, నర్సింహ, సదాశివ, అన్వర్‌ పాషా, అంకాలప్ప తదితరులు పాల్గొన్నారు.