ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

ABN , First Publish Date - 2020-08-04T11:03:06+05:30 IST

రాఖీ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డికి ఆయన సోదరీమణులు సద్గుణ, సువర్ణలు రాఖీ కట్టారు. హైదరాబాద్‌లోని ఎమ్మొల్యే గృహంలో సోమవారం రాఖీలు కట్టి మిఠాయిలు

ఘనంగా రాఖీ పౌర్ణమి వేడుకలు

జడ్చర్ల/హన్వాడ/బాలానగర్‌, రాజాపూర్‌ /భూ త్పూర్‌ /దేవరకద్ర/ చిన్నచింతకుంట/ బాదేపల్లి/ నవాబ్‌పేట, ఆగస్టు 3: రాఖీ పండుగ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డికి ఆయన సోదరీమణులు సద్గుణ, సువర్ణలు రాఖీ కట్టారు. హైదరాబాద్‌లోని ఎమ్మొల్యే గృహంలో సోమవారం రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించారు. అలాగే హన్వాడ, బాలానగర్‌ మండల ప్రజలు సోమవారం రాఖీ పౌర్ణమిని ఘనంగా జరుపుకున్నారు. అక్కాచెల్లెల్లు అన్నాతమ్ముళ్లలకు రాఖీలు కట్టి వేడుకలను నిర్వహించుకున్నారు. రాజాపూర్‌ మండల పరిధిలోని గుండ్లపోట్లపల్లికి చెందిన తెలంగాణ జాగృతి రాష్ట్ర నాయకుడు మార్పడగా కృష్ణారె డ్డికి, తెలంగాణ జగృతి రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హైదరాబాద్‌లోని తన ఇంటిలో రాఖీ కట్టి స్వీట్లు తినిపించారు. భూత్పూర్‌ మండలంలోని అన్ని గ్రామాల్లో సోమవారం రాఖీ పౌర్ణమి వేడుకలను సాదాసీదాగా జరుపుకున్నారు.


ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డికి హైదరాబాద్‌లో అక్కా చెల్లెళ్లు రాఖీలు కట్టి పండుగ వేడుకలను జరుపుకున్నారు. మునిసిపల్‌ పట్టణ ప్రజలకు చైర్మన్‌ బస్వరాజుగౌడ్‌, వైస్‌ చైర్మన్‌ కెంద్యాల శ్రీనివాసులు, ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి, జిల్లా మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు సత్య నారాయణ ప్రజలకు రాఖీ పండుగ శుభాకాం క్షలు తెలిపారు. దేవరకద్ర, జడ్చర్ల, నవాబ్‌పేట మండలాల్లో రక్షాబంధన్‌ వేడుకలను సోమవారం ఘనంగా జరుపుకున్నారు. గ్రామాల్లో సందడి నెల కొంది. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించా రు. చిన్నచింతకుంట మండలంలోని కురుమూర్తి వెంకటేశ్వర స్వామి, రామలింగేశ్వరస్వామి ఆల యాల్లో భక్తుల సందడి నెలకొంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నా రు. రామలింగేశ్వస్వామి వారి ఆలయంలో టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొత్తకోట దయాకర్‌ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు.


శివ మార్కెండేయ స్వామి ఆలయంలో పూజలు

మహబూబ్‌నగర్‌ టౌన్‌: రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని సోమవారం స్థానిక పద్మావతి కాలనీలోని అయ్యప్ప గుట్ట సమీపంలో గల శివ మార్కేండేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఆలయ ఛైర్మెన్‌ మచ్చ ప్రభా కర్‌ ఆధ్వర్యంలో ఘనంగా హోమం నిర్వహించా రు. కార్యక్రమంలో భాగంగా విఘ్నేశ్వరుడికి, సుబ్రమణ్య స్వామికి అభిషేకాలు చేశారు. కార్య క్రమంలో అధ్యక్షులు అప్పం అనంతరాములు, దేవాలయ కమిటీ సభ్యులు పల్లాటి తారకం, కె.పవన్‌కుమార్‌, డి.వెంకటేశ్‌, కె.సుకుమార్‌, కె. సత్యనారాయణ బాన రామస్వామి, సూర్యప్రతాప్‌, బిజ్య శంకర్‌, కె. సత్యనారాయణ, మహిళ అధ్యక్షు రాలు మచ్చవాణి పాల్గొన్నారు.

Updated Date - 2020-08-04T11:03:06+05:30 IST