ఘనంగా రాహుల్‌గాంధీ పుట్టినరోజు వేడుకలు

ABN , First Publish Date - 2021-06-20T05:42:04+05:30 IST

ఏఐసీసీ నాయకులు రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల వ్యాప్తంగా శనివారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు

ఘనంగా రాహుల్‌గాంధీ పుట్టినరోజు వేడుకలు
సంగారెడ్డిలోని ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగులకు అన్నదానం చేస్తున్న డీసీసీ అధ్యక్షురాలు నిర్మలాజగ్గారెడ్డి

పటాన్‌చెరు/జహీరాబాద్‌/కంగ్టి/మెదక్‌/నర్సాపూర్‌/చేగుంట/చిన్నశంకరంపేట, జూన్‌ 19 : ఏఐసీసీ నాయకులు రాహుల్‌గాంధీ జన్మదిన వేడుకలను సంగారెడ్డి, మెదక్‌ జిల్లాల వ్యాప్తంగా శనివారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అమీన్‌పూర్‌లో మహిళా కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షురాలు కాటసుధాశ్రీనివా్‌సగౌడ్‌, కౌన్సిలర్లు, జహీరాబాద్‌లో ఎంపీపీ గిరిధర్‌రెడ్డి, టీపీసీసీ నాయకులు నరోత్తం, రాష్ట్ర ఎస్సీ సెల్‌ నాయకులు భీమయ్య, జిల్లా యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు ఉదయ్‌శంకర్‌పాటిల్‌, జడ్పీటీసీ  రాందాస్‌, కంగ్టిలోని క్రాంతిచౌక్‌ వద్ద పీఏసీఎస్‌ చైర్మన్‌ మారుతిరెడ్డి, మెదక్‌లోని బాలసదనం పిల్లల హాస్టల్‌లో యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు మహెందర్‌రెడ్డి, కౌన్సిలర్లు, నర్సాపూర్‌ ఆసుపత్రిలో పీసీసీ కార్యదర్శి ఆవులరాజిరెడ్డి, పీసీసీ అధికార ప్రతినిధి ఆంజనేయులుగౌడ్‌, మైనార్టీ సెల్‌ కార్యదర్శి హకీమ్‌, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు రిజాయ్‌అలీ, చేగుంటలో కాంగ్రెస్‌ పార్టీ దుబ్బాక నియోజకవర్గ ఇన్‌చార్జి చెరుకు శ్రీనివాస్‌ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు, యువకులు కేక్‌ను కట్‌ చేశారు. బాణాసంచా కాల్చుతూ సంబురాలు  జరుపుకున్నారు. పండ్లు, బ్రెడ్డు పంపిణీ చేశారు. అన్నదాన కార్యక్రమాలు, మాస్క్‌లు, శానిటైజర్లు, మెడికల్‌ కిట్ల పంపిణీ తదితర కార్యక్రమాలు కాంగ్రెస్‌ నాయకులు చేపట్టారు.

అధికారంలో లేకున్నా.. ప్రజల పక్షానే కాంగ్రెస్‌

- డీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డి

సంగారెడ్డి టౌన్‌, జూన్‌ 19 : అధికారంలో ఉన్నా.. లేకపోయినా కాంగ్రెస్‌ పార్టీ ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యలపై పోరాటం సాగిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షురాలు టి.నిర్మలాజగ్గారెడ్డి అన్నారు. రాహుల్‌గాంధీ జన్మదినాన్ని పురస్కరించుకొని కొండాపూర్‌ మండలం మల్కాపూర్‌లోని ఓ ఫంక్షన్‌ హాలులో ఎమ్మెల్యే జగ్గారెడ్డి 30 మంది వికలాంగులకు వీల్‌చైర్లను అందజేయగా, సంగారెడ్డిలోని ప్రభుత్వాసుపత్రిలో మానసిక వికలాంగులకు  నిర్మలారెడ్డి, యువజన కాంగ్రెస్‌ నాయకురాలు జయారెడ్డి, టీపీసీసీ కార్యదర్శి తోపాజి అనంతకిషన్‌ అన్నదానం చేశారు. ఆమె వెంట యువజన కాంగ్రెస్‌ అధ్యక్షుడు  సంతోష్‌, మాజీ కౌన్సిలర్‌ కసిని రాజు, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు జార్జ్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-06-20T05:42:04+05:30 IST