Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

ఘనంగా నారా లోకేశ జన్మదిన వేడుకలు

twitter-iconwatsapp-iconfb-icon
ఘనంగా నారా లోకేశ జన్మదిన వేడుకలునారా లోకేశ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా గుంతకల్లులో జితేంద్రగౌడ్‌కు కేక్‌ తినిపిస్తున్న టీడీపీ నాయకులు

గుంతకల్లు, జనవరి 23: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ పుట్టిన రోజు వేడుకలను ఆదివారం జిల్లావ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. కేక్‌లు కట్‌ చేసి తెలుగుతమ్ముళ్లు సంబరాలు చేశారు. పలుచోట్ల అన్నదానం, రక్తదా నం చేశారు. నారా లోకేశ యువ నాయకత్వంలో టీడీపీ బ లోపేతానికి సమష్టిగా కృషి చేద్దామని నాయకులు పిలుపునిచ్చారు. గుంతకల్లు టీడీపీ కార్యాలయం ఎదుట మూతబడిన అన్నా క్యాంటీన వద్ద నారా లోకేశ పుట్టిన రోజుల వేడుకలను నిర్వహించారు. మాజీ శాసనసభ్యుడు ఆర్‌ జితేంద్ర గౌడు ముఖ్యఅతిథిగా హాజరై కేక్‌ కట్‌ చేసి లోకేశకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ నాయకులు, కా ర్యకర్తలకు మిఠాయిని పంచారు. అనంతరం ఆయన మా ట్లాడుతూ నిలిపివేసిన అన్నా క్యాంటీన్లను పునః ప్రారంభిం చి పేదల కడుపులు నింపాలని డిమాండ్‌ చేశారు. లోకేశ తన తండ్రి చంద్రబాబు లాగానే ఎన్నో ఉన్నత పదవులను పొందాలని ఆకాంక్షించారు. టీడీపీ హయాంలో అన్నా క్యాం టీన్లలో ఎందరో పేదలు ఐదు రూపాయలతో భోజనాలు చే సేవారన్నారు. అధికారంలోకి వచ్చిన జగన పేదల నోటి నుంచి అన్నాన్ని లాగేశాడన్నారు. పేదలు, వృద్ధులను పస్తులపాల్జేశాడన్నారు. వెంటనే అన్నా క్యాంటీన్లను ప్రారంభించాలని డిమాండ్‌చేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ ప్ర తాప్‌ నాయుడు, టీడీపీ పార్లమెంటు కార్యనిర్వాహక కార్యదర్శి గుమ్మనూరు వెంకటేశులు, కౌన్సిలరు కే కృపాకర్‌, గు డిపాటి ఆంజనేయులు, మాజీ ఎంపీటీసీ సభ్యుడు తలారి మస్తానప్ప, నాయకులు ఆర్‌ అనిల్‌కుమార్‌ గౌడు, సిమెం టు నారాయణ, ఫజులు, డీ మస్తాన, రామన్నచౌదరి, పోతప్పగారి శ్రీనివాసులు, తలారి శివ పాల్గొన్నారు. 


కమ్మ సేవా సంఘం కార్యాలయంలో..

గుంతకల్లులోని కమ్మ సేవా సంఘ కార్యాలయంలో టీడీ పీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ పుట్టిన రోజు వేడుకల ను నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి మిఠాయిని పంచారు. కా ర్యక్రమంలో కమ్మ సేవా సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి త మ్మినేని రమేశ, మాజీ సర్పంచు అల్లు శ్రీనివాసులు, నాయకులు రమేశ, దబ్బర నారాయణ, గుండాల శ్రీకాంత, బం డారు ధనుంజయ, చాగంటి ఆదినారాయణ, మధుసూదన, రామచంద్ర, రాజశేఖర్‌, నరేంద్ర నాయుడు, దామోదర్‌, గౌ తమ్‌, కదిరప్ప పాల్గొన్నారు. 


కళ్యాణదుర్గం: రాష్ట్రానికి నారాలోకేశ యువ నాయకత్వమే శరణ్యమని టీడీపీ నియోజకవర్గ ఇనచార్జ్‌ ఉమామహేశ్వరనాయుడు పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఎన్టీఆర్‌ భవన వద్ద లోకేశ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం నాయకులు, కార్యకర్తలతో కలిసి కేక్‌ కట్‌చే సి సంబరాలు జరుపుకున్నారు. కార్యకర్తలకు మిఠాయిలు పం చి, శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో నాయకులు దొడగట్ట నారాయణ, మురళి, తలారి సత్యప్ప, రామరాజు, కొల్లప్ప, బిక్కి రామలక్ష్మి గోవిందప్ప, పోస్టు పాలన్న, శ్రీరాములు, నాగరాజు, వేలూరి అరవింద్‌, బ్రిజేష్‌, బిక్కి గో విందరాజులు, హనుమంతరాయుడు, అచ్చోళ్ల తిప్పేస్వామి, వెంకటేశులు, శీన, సుధాకర్‌యాదవ్‌, హరి పాల్గొన్నారు. 


 అదేవిధంగా కళ్యాణదుర్గంలోని ఉన్నం హనుమంతరాయచౌదరి వ్యక్తిగత కార్యాలయంలో నాయకులతో కలిసి లో కేశ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించుకున్నారు. కేక్‌కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఉన్నం మాట్లాడుతూ నారాలోకేశ నాయకత్వమే రాష్ట్రానిక శరణ్యమన్నారు. కార్యక్రమంలో నాయకులు ఆర్జీ శివశంకర్‌, గోళ్ల వెంకటేశులు, ఆవుల తిప్పేస్వామి, తలారి ఎర్రిస్వామి, గా జుల శ్రీరాములు, మారుతిచౌదరి, గోవిందరెడ్డి, డీకే రామాంజనేయులు, తిమ్మరాజులు, గోళ్ల రాము, రామన్న పాల్గొన్నారు. 


 నారాలోకేశ పుట్టిన రోజు వేడుకలను కళ్యాణదుర్గం ఎన్టీఆర్‌ భవన వద్ద సీనియర్‌ నాయకులు చౌళం మల్లికార్జున, అనంతపురం పార్లమెంట్‌ ఉపాధ్యక్షులు వైపీ రమే్‌ష ఆధ్వ ర్యంలో ఘనంగా నిర్వహించారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం నాయకులతో కలిసి కేక్‌ కట్‌చేసి సంబరాలు జరుపుకున్నారు. నారా లోకేశ అడుగుజాడల్లో న డుద్దామని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో నా యకులు పాపంపల్లి రామాంజనేయులు, రాజశేఖర్‌చౌదరి, ఊటంకి రామాంజనేయులు, గౌని శ్రీనివాసరెడ్డి, ఒంటిమిద్దిసత్తి, హనుమంతరెడ్డి, గొర్ల గోవిందు, లోకేష్‌ పాల్గొన్నారు. 


గుత్తి: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ జ న్మదిన వేడుకలను టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వెంకట శివుడు యాదవ్‌ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక ఆయన స్వగృహం లో ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి మిఠాయిని పం చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు నంద్యాల రంగారె డ్డి యాదవ్‌, నరేంద్రచౌదరి, ఆనంద్‌, రమేష్‌, సుంకన్న, వెం కటశివుడు యాదవ్‌, వేణుగోపాల్‌, రాము, రమణ, ఆదినారాయణ, మహే్‌షరెడ్డి, పవన, భరత, రాఘవ పాల్గొన్నారు. అలాగే ఆర్‌అండ్‌బీ భవనంలో టీడీపీ మండల కన్వీనర్‌ బ ర్దీవలి ఆధ్వర్యంలో నారా లోకేశ జన్మదిన వేడుకలు ఘనం గా నిర్వహించారు. కార్యక్రమంలో టౌన బ్యాంకు అధ్యక్షుడు అబ్దుల్‌ జిలాన, ఉపాధ్యక్షుడు కృష్ణ, మాజీ ఎంపీపీ వీరభద్రయ్య, నాయకులు సుధాకర్‌ నాయుడు, రాష్ట్ర ఎస్సీసెల్‌ కార్యదర్శి దిల్‌కా శీన, సాంబశివయ్య, సుధాకర్‌, తిరుపాల్‌, చిన్నరెడ్డి యాదవ్‌ పాల్గొన్నారు.


వజ్రకరూరు: స్థానిక మహాత్మాగాంధీ విగ్రహం వద్ద ఆదివారం నారా లోకేశ జన్మదిన వేడుకలను ఘనంగా ని ర్వహించారు. టీడీపీ జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు నాగభూషణం మాట్లాడుతూ లోకేశ విద్యార్థుల సమస్యలపై ప లు పోరాటాలు చేశారన్నారు. నిరంతరం ప్రజా సమస్యల పై ప్రజాక్షేత్రంలో పోరాడుతున్నారన్నారు. కార్యక్రమంలో టీ డీపీ మండల నాయకులు వలి, దస్తగిరి, మనోహర్‌, రఘు, నాయకులు గురుప్రసాద్‌, రాధాచౌదరి, వీరన్న, సుధాకర్‌, గుర్రప్ప పాల్గొన్నారు.


కంబదూరు: టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ జ న్మదిన వేడుకలను నాయకులను ఆదివారం స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి సంబరాలు జరుపుకున్నారు. శుభాకాంక్షలు తెలుపుకుని మి ఠాయిలు పంచిపెట్టారు. గ్రామగ్రామానా టీడీపీ అభ్యున్నతి కి శాయశక్తులా ప్రతిఒక్కరు కృషిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలుగు రైతు రాష్ట్ర కార్యద ర్శి అమిలినేని లక్ష్మినారాయణ, నాయకులు శివన్న, శ్రీరాములు, మల్లికార్జున, ఆవుల తిప్పేస్వామి, తలారి ఎర్రిస్వా మి, ప్రభాకర్‌, శ్రీనివాసులు, గంగిరెడ్డి, గాజుల మారుతి, గా జుల రామాంజనేయులు, సురేంద్ర, జయరామిరెడ్డి, దండాజయరాం, జెల్లిపల్లి శ్రీధర్‌బాబు, సదాశివ, రాము, శీన, ఉపసర్పంచు షఫీ, భాస్కర్‌, ముత్యాలు పాల్గొన్నారు. 


రక్తదానం చేసి ప్రాణదాతలుకండి

గుంతకల్లు టౌన: ఆపద, ప్రాణాపాయ స్థితిలో ఉన్నవారికి యువకులు రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని తె లుగు యువత పట్టణ అధ్యక్షుడు బీ రాము పేర్కొన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగు యువత పట్టణ అధ్యక్షుడు బీ రాము ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 176 మంది రక్తదానం చేశారన్నారు. రక్తదాతలకు ప్రశంసా పత్రాలు అందజేశామన్నారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో గోపి ఛారిటబుల్‌ ట్రస్ట్‌, బ్లడ్‌బ్యాంకు సి బ్బంది పాల్గొన్నారు.


తాడిపత్రి: స్థానిక మున్సిపల్‌ చైర్మన జేసీ ప్రభాకర్‌రెడ్డి నివాసంలో ఆదివారం టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ జన్మదిన వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా టీడీపీ ఇనచార్జి జేసీ అశ్మితరెడ్డి కేక్‌ కట్‌ చేసి నాయకులు, కార్యకర్తలతో సంతోషం పంచుకున్నారు. అనంతరం పెద్దఎత్తున బాణాసంచా కాల్చారు. నారా లోకేశ  ఆ శయాలకు అనుగుణంగా మనమందరం పనిచేయాలని జే సీ అశ్మితరెడ్డి పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావాలంటే ప్రతిఒక్కరు క్రియాశీలకం గా వ్యవహరించాలన్నారు. 


కుందుర్పి: స్థానికంగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్ర ధాన కార్యదర్శి నారాలోకేశ జన్మదిన వేడుకలను ఆదివారం తెలుగు యువత నాయకులు ఘనంగా నిర్వహించారు.  జ న్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్‌ కట్‌చేసి మిఠాయిలు పంచారు. కార్యక్రమంలో తెలుగుయువత నాయకు లు అనిల్‌, బాలకృష్ణ, హేమంత, ప్రసాద్‌, మహేష్‌, వెంకటనాయుడు, సోమనాథ్‌ పాల్గొన్నారు. 


కణేకల్లు: నారా లోకేశ జన్మదిన వేడుకలు ఆదివారం  మండలంలో ఘనంగా జరిగాయి. టీడీపీ కన్వీనర్‌ లాలెప్ప, నాయకులు ఆనంద్‌రాజ్‌, సుదర్శన, ఆది, వన్నారెడ్డి, బసవరాజు, మాబూసాబ్‌, చాంద్‌ బాషా, షేక్‌ ముజ్జు, షేక్‌ హు స్సేన, కురుబ నాగరాజు, మారుతి, జయరామ్‌ చౌదరితో పాటు పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు బర్త్‌డే కే క్‌ కట్‌ చేసి ఘనంగా సంబరాలు జరుపుకున్నారు.


యల్లనూరు: మండలంలో నారా లోకేశ పుట్టినరోజు వే డుకలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా యల్లనూరు, జంగంపల్లి గ్రామాల్లో కేక్‌ కట్‌చేసి పంచిపెట్టారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు జంగంప ల్లి అనిల్‌కుమార్‌, రామాంజనేయులు, చల్లాచంద్రశేఖర్‌నాయుడు, మేడికుర్తి రామకృష్ణారెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.


యాడికి: లోకేశ జన్మదిన వేడుకలను మండలంలో ఘ నంగా నిర్వహించారు. రాయలచెరువులో మాజీ ఎంపీపీ వే లూరు రంగయ్య, మండల కన్వీనర్‌ మాదాల అనిల్‌కుమా ర్‌, యాడికిలో నాగశేఖర్‌, మధురాజు కేక్‌కట్‌ చేశారు. లో కేశ హయాంలో రాష్ట్రంలో 35వేల కి.మీ. సీసీ రోడ్లు నిర్మించారని, ఎల్‌ఈడీ లైట్ల వెలుగులు నారా లోకేశ చొరవతోనే సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో నాయకులు పరిమి చ రణ్‌, మదమంచి శివ, నరేంద్రబాబు, శేఖర్‌, శ్రీహరి, శోభనబాబు, శ్రీనివాసులు, రామాంజనేయులు, సోమశేఖర్‌, నెట్టికంటయ్య, రామానాయుడు, నాగరాజుగౌడ్‌, జాఫర్‌, సుధాకర్‌, రమేష్‌, చంద్రశేఖర్‌, శివన్న, మనోహర్‌ పాల్గొన్నారు.


రాయదుర్గం: స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో ఆదివారం నారా లోకేశ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. కేక్‌ కట్‌ చేసి సంబరాలు చేసుకున్నారు.  నాయకులు కాలవ సన్నణ్ణ, కడ్డిపూడి మహబూబ్‌ బాషా, నల్లపూల వెంకటేశులు నేతృత్వంలో టీడీపీ శ్రేణులు ఘ నంగా వేడుకలను నిర్వహించారు. సమర్థవంతమైన నాయకత్వం రాషా్ట్రనికి అవసరమని, నారా చంద్రబాబు నాయు డు కుటుంబంతోనే అది సాధ్యమన్నారు. రాష్ట్రంలో నారా చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవడమే ప్రస్తుత ప రిస్థితుల్లో చాలా అవసరమన్నారు. 


పుట్లూరు: మండలంలోని కొండుగారికుంట గ్రామంలో ఆదివారం టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు సుదర్శననాయుడు కేక్‌ కట్‌చేసి స్వీట్లు పంచిపెట్టారు. లోకేశ ప్రజల సమస్యలపై అనునిత్యం పోరాటం చేస్తున్నాడన్నారు. భవిష్యతలో పార్టీ అధికారం కోసం కష్టపడుతున్నారన్నారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోమటికుంట్ల రవిచంద్ర, ఆదినారాయణరెడ్డి పాల్గొన్నారు. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.