ఘనంగా మంత్రి కేటీ రామారావు జన్మదిన వేడుకలు

ABN , First Publish Date - 2021-07-25T05:49:40+05:30 IST

రాష్ట్ర మున్సిపపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు జన్మదినం పురస్కరించుకొని శనివారం నగరంలో రాజ్యసభసభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, నగర మేయర్‌ వై.సునీల్‌రావుతో కలిసి మొక్కలు నాటారు.

ఘనంగా మంత్రి కేటీ రామారావు జన్మదిన వేడుకలు
మొక్క నాటుతున్న ఎంపీ సంతోష్‌కుమార్‌, మంత్రి గంగుల కమలాకర్‌

- ముక్కోటి వృక్షార్చనలో మొక్కలు నాటిన నేతలు

- మంత్రి ‘గంగుల’తో కలిసి మొక్కలు నాటిన ఎంపీ సంతోష్‌కుమార్‌ 

కరీంనగర్‌ టౌన్‌, జూలై 24: రాష్ట్ర మున్సిపపల్‌, ఐటీశాఖ మంత్రి కేటీ రామారావు జన్మదినం పురస్కరించుకొని శనివారం నగరంలో రాజ్యసభసభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్‌, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, నగర మేయర్‌ వై.సునీల్‌రావుతో కలిసి మొక్కలు నాటారు. జిల్లా పర్యటనకు వచ్చిన సంతోష్‌కుమార్‌కు మేయర్‌ సునీల్‌రావు, కమిషనర్‌ వల్లూరి క్రాంతి పూల మొక్కను బహూకరించి స్వాగతం పలికారు. అనంతరం ముక్కోటి వృక్షార్చనలో భాగంగా ప్రభుత్వ ఆంబోతు వీర్య సేకరణ కేంద్రాన్ని సందర్శించారు. మియావాకీ పద్దతిలో మంత్రి గంగుల, మేయర్‌ సునీల్‌రావు, చొప్పదండి ఎమ్మెల్యే రవిశంకర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ క్రాంతితో కలిసి మొక్కలు నాటి, 40 వేల మొక్కలను సంరక్షించిన నగరపాలక సంస్థ పాలకవర్గం, అధికారులను అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్‌ చల్లా స్వరూపరాణి హరిశంకర్‌, ఏఎంసీ చైర్‌పర్సన్‌ ఎలుక అనిత, పలువురు కార్పొరేటర్లు, నాయకులు, స్థానికులు పాల్గొన్నారు. అంబేద్కర్‌ స్టేడియంలో మాజీ మేయర్‌, జిల్లా యోగా, హాకీ అసోసియేషన్‌ అధ్యక్షుడు సర్దార్‌ రవీందర్‌సింగ్‌ ముక్కోటి వృక్షోత్సవంలో భాగంగా క్రీడాసంఘాల ప్రతినిధులు, క్రీడాకారులు, అధికారులతో కలిసి పెద్ద ఎత్తున మొక్కలు నాటారు. 

ప్రకృతి, పర్యావరణ చర్యల్లో కరీంనగర్‌ పోలీసుల భాగస్వామ్యం అమూల్యం

- రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌

కరీంనగర్‌ క్రైం : ప్రకృతి, పర్యావరణ చర్యల్లో కరీంనగర్‌ కమిషనరేట్‌ పోలీసుల భాగస్వామ్యం అమూల్యమని  రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్‌ తెలిపారు. శనివారం మంత్రి కేటీఆర్‌ జన్మదినోత్సవం సందర్భంగా ఎంపీ జోగినిపల్లి సంతోష్‌కుమార్‌, రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌లతోపాటు పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు కరీంనగర్‌ కమిషనరేట్‌ కేంద్రంలో మొక్క లు నాటారు. ఈ సందర్భంగా ఎంపీ సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ పోలీస్‌ కమిషనర్‌ వీబీ కమలాసన్‌రెడ్డి ఆధ్వర్యంలో సీటీసీలో కొనసాగుతున్న చిట్టడవుల పెంపకం రాష్ర్టానికే ఆదర్శం అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీ కమలాసన్‌ రెడ్డి, నగర మేయర్‌ వై సునీల్‌రావు, కమిషనర్‌ వల్లూరు క్రాంతి, అడిషల్‌ డీసీపీ(ఎల్‌అండ్‌ఓ) ఎస్‌ శ్రీనివాస్‌, ఏసీపీ శివభాస్కర్‌, నాగేందర్‌, పలువురు పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-25T05:49:40+05:30 IST