Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఘనంగా జ్యోతిరావు పూలే వర్ధంతి వేడుకలు

ఆదోని, నవంబరు 28: మహాత్మ జ్యోతిరావుపూలే వర్ధంతి వేడుకలను స్థానిక టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఆదివారం జ్యోతిరావుపూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కర్నూలు పార్లమెంట్‌ కార్యదర్శ బుద్దారెడ్డి మాట్లాడుతూ సమ సమాజ స్థాపనకు, బడుగ, బలహీన వర్గాలకు విద్యను అందిస్తూ అన్నిట్లో సమాన హక్కుల కోసం పోరాడిన పూలే ఆశయ సాధనలో అందరం నడుద్దామన్నారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్‌ తిమ్మప్ప, వెంకటేష్‌, నల్లన్న, లక్ష్మి, కేసన్న, రాజు, సజ్జాద్‌, జయరాం, నాగేద్ర, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు పాల్గొన్నారు. 


పూలే ఆశయ సాధనకు కృషి చేద్దాం

భారత ప్రథమ సామాజికతత్వవేత్త, ఉద్యమకారుడు, సంఘ సేవకుడు మహాత్మా జ్యోతిరావుపూలే ఆశయ సాధనకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా నాయకుడు ఎండీ బసవరాజుస్వామి, నీలకంఠప్ప, మధుసూధన్‌బాబు అన్నారు. ఆదివారం భీమాస్‌ ఫంక్షన్‌ హాల్‌లో మహాత్మా జ్యోతిరావు పూలే 131వ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. బీసీ నాయకులు మల్లేశ్వరరావు, బ్రహ్మానందం, గోవిందరాజలు, హెచ్‌ఎం విశ్వనాథ్‌, సాయినాథ్‌, వీరన్నగౌడ్‌, చెన్నబసవయ్య, వీరన్న పాల్గొన్నారు. 


ఆలూరు: బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవలు చిరస్మరణీయమని టీడీపీ రాష్ట్ర నాయకుడు నారాయణరెడ్డి, ఆలూరు, పెద్దహోతూరు, మరటకట్టు సర్పంచ్‌లు అరుణదేవి, లక్ష్మణ, ఎల్లప్ప అన్నారు. ఆదివారం ఆలూరు టీడీపీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావుపూలే వర్ధంతి సంద ర్భంగా ఆయన ఆశయ సాధనకు కృష చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ చిన్న, టీడీపీ మండల కన్వీనర్‌ అశోక్‌, నాయకులు రాజశేఖర్‌, నరసప్ప, సురేంద్ర, నారాయణ, మసాల జగన్‌, మద్దిలేటి, రామాంజనేయులు, నాగరాజ, మద్దిలేటి పాల్గొన్నారు. 


ఎమ్మిగనూరు టౌన్‌: మహాత్మ జోతిరావు పూలే, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయాలను కొనసాగించాలని వీరశైవ లింగాయత్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ వై.రుద్రగౌడ్‌ అన్నారు. ఆదివారం సోమప్ప సర్కిల్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్థి సంఘం ఆద్వర్యంలో పూలే, అంబేడ్కర్‌ వర్ధంతి వారోత్సవాల సందర్భంగా చిత్రపటాలకు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి పూలే, అంబేడ్కర్‌ చేసిన సేవలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు నరసన్న, గుడేకల్లు సర్పంచ్‌ నాగేష్‌, బీసీ నాయకులు ఎంఆర్‌ శీను, గణేష్‌, ఆర్‌వీపీఎస్‌ నాయకులు ఖాజా, కృష్ణ పాల్గొన్నారు. 


మంత్రాలయం: విద్య, ఆదాయం, అంటరానితనం విముక్తి చేయటానికి కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే ఆశయ సాధనకు యువత ముందుకు రావాలని బహుజన సమాజ్‌ పార్టీ జిల్లా ఇన్‌చార్జి లక్ష్మీనారాయణ, సామెల్‌ అన్నారు. ఆదివారం మంత్రాలయంలోని అంబేడ్కర్‌ విగ్రహం దగ్గర బీఎస్పీ ప్రధాన కార్యదర్శి మాణిక్యం, రాజన్న, మోహన్‌ ఆధ్వర్యంలో పూలే చిత్రపటానికి పూలమాల వేసి 131 వర్ధతి నిర్వహించారు. కార్యక్రమంలో బీఎస్పీ నాయకులు బంగారప్ప, జాను, మారెప్ప, జయరాజు, స్వామిదాసు, సుధాకర్‌లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement