ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

ABN , First Publish Date - 2021-11-26T05:30:00+05:30 IST

రాజ్యాంగ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
కర్నూలు: అంబేడ్కర్‌కు నివాళి అర్పిస్తున్న ఎస్పీ సుధీర్‌ కుమార్‌ రెడ్డి

రాజ్యాంగ దినోత్సవాన్ని శుక్రవారం ఘనంగా నిర్వహించారు.  ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాలు, పార్టీల నాయకులు అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఆర్‌యూలో వీసీ రాజ్యాంగ దినం సభలో పాల్గొన్నారు. 


కర్నూలు(లీగల్‌), నవంబరు 26: భారత రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరికీ సమానంగా అవకాశాలు లభించేలా రచించారని, ఆ రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ సకాలంలో లభించినప్పుడే రాజ్యాంగ నిర్మాతల ఆశయాలు నెరవేరుతాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డా.వీఆర్‌కే కృపాసాగర్‌ తెలిపారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా శుక్రవారం టౌన్‌ మోడల్‌ పాఠశాలలో జరిగిన  కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆ తర్వాత స్థానిక సిల్వర్‌ జూబ్లీ కళాశాలలో జరిగిన మరో కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సీహెచ్‌ వెంకట నాగ శ్రీనివాసరావు మాట్లాడుతూ సమాజంలో ప్రతి ఒక్కరూ తమ హక్కులతోపాటు విధులను కూడా పాటించాలని కోరారు. కార్యక్రమాల్లో ఆయా విద్యాసంస్థల హెచ్‌ఎంలతో పాటు లెక్చరర్లు, న్యాయవాదులు, విద్యార్థులు పాల్గొన్నారు. 


 నగరంలోని న్యాయ ప్రసూనా న్యాయ కళాశాలలో ప్రిన్సిపాల్‌ డా.ఎం.శివాజీరావు ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో డీన్‌ శివకుమార్‌, లెక్చరర్లు అబ్దుల్‌ రవూఫ్‌, మెహదీఖాన్‌, విద్యా ర్థులు పాల్గొన్నారు. తర్వాత విద్యార్థులకు వకృత్వ పోటీలను నిర్వహించారు. 


నగరంలోని పాతబస్టాండులోని డా.బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహం సమీపంలో సీనియర్‌ న్యాయవాది వై.జయరాజు ఆధ్వర్యంలో జాతీయ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించారు. న్యాయవాదులు, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు మాసిపోగు సుబ్బయ్య, పీవీ ప్రసాదరావు, బి.చంద్రుడు, జి.బాలరంగస్వామి, తదితరులు పాల్గొన్నారు.


కర్నూలు(అగ్రికల్చర్‌): కేంద్ర, రాష్ట్రాల్లో పాలన సాగిస్తున్న ప్రస్తుత నేతలు అంబేడ్కర్‌ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారని, మనమే రాజ్యాంగాన్ని రక్షించుకోవాలని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. నగరంలోని టీడీపీ కార్యాలయంలో రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఇతర నాయకులు, కార్యకర్తలు కలిసి డా.బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి నంద్యాల నాగేంద్ర కుమార్‌, కోడుమూరు ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్‌, బీసీ సెల్‌ అధ్యక్షుడు సత్రం రామకృష్ణుడు, ఎస్సీ సెల్‌ అధ్యక్షుడు ధరూర్‌ జేమ్స్‌, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు హనుమంతరావు చౌదరి, పేరపోగు రాజు, బజారన్న, ప్రవీణ్‌, విజయకుమార్‌, బాబు రావు తదితరులు పాల్గొన్నారు.


కర్నూలు: నగరంలోని జిల్లా పోలీస్‌ కార్యాలయం పరేడ్‌ మైదానంలో ఎస్పీ సుధీర్‌ కుమార్‌రెడ్డి అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం ఎస్పీ రాజ్యాంగ దినోత్సవం ప్రాధాన్యం గురించి వివరించి, భారత రాజ్యాంగ పీఠికను చదివి వినిపించి పోలీసుల అధికారులు, సిబ్బందిచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో సెబ్‌ అడిషనల్‌ ఎస్పీ తుహిన్‌ సిన్హా, హోంగార్డు కమాండెంట్‌ యు.రామ్మోహన్‌, డీఎస్పీలు మహేష్‌, ఇలియాజ్‌బాషా, రవీంద్రారెడ్డి, డీపీవో ఏవో సురేష్‌ బాబు, ఎస్పీ పీఏ నాగరాజు, సీఐలు శ్రీనివాసరెడ్డి, పార్థసారధిరెడ్డి, ఆర్‌ఐలు వీఎస్‌ రమణ, సురేంద్రారెడ్డి, ఎస్‌ఐలు, ఆర్‌ఎస్‌ఐలు, డీపీవో కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.


కర్నూలు(అర్బన్‌): భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేడ్కర్‌ గొప్ప దార్శనికుడని ఆర్‌యూ వీసీ ఎ.ఆనందరావు అన్నారు. యూనివర్సిటీలోని సెనేట్‌ హాలులో ఆర్‌యూ సైన్సు కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌ ఎంఈ రాణి అఽధ్యక్షతన అంబేడ్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. రిజిస్ట్రార్‌ మధుసూదన వర్మ, రెక్టార్‌ సంజీవరావు మాట్లాడుతూ రాజ్యాంగమే భారతదేశానికి రక్షణ అన్నారు. రచయిత పాణి మాట్లాడుతూ రాజ్యాంగం అనేక ప్రజా పోరాటాల ఫలితమని అన్నారు. డీన్లు, వివిధ విభాధిపతులు, కోఆర్డినేటర్లు, అధ్యాపకులు, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-26T05:30:00+05:30 IST