Abn logo
Apr 21 2021 @ 00:05AM

ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు

  హిందూపురం టౌన, ఏప్రిల్‌ 20: టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు మంగళవారం టీడీపీ నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా అంధుల పాఠశాలలో కేక్‌కట్‌చేసి పంచిపెట్టారు. అదేవిధంగా ఐసీడీపీ ఆధ్వర్యంలో అంధ విద్యార్థులకు మాస్కులు, పండ్లు, బ్రెయిలీషీట్స్‌ అందజేశారు. ఈ సందర్భంగా మాజీ అహుడా చైర్మన అంబికా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ క్రమశిక్షణకు మారుపేరు పరిపాలనదక్షకుడు ఏడు పదుల వయసులో కూడా తెలుగు జాతికోసం అహర్నిషం శ్రమిస్తున్న మహోన్నత వ్యక్తి చంద్రబాబు అన్నారు. భావితరాల భవిష్యత్తుకోసం అపరభగీరథుడిగా కృషిచేస్తున్నాడన్నారు. నవ్యాంద్ర నిర్మాతగా ఆయన చేస్తున్న కృషి ఎనలేనిదన్నారు. ఈయనకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరారు. తెలుగుజాతిని ప్రపంచ దేశాల్లో తలెత్తుకునేలా చేసిన ఘనత చంద్రబాబుదన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి రామాంజినమ్మ, హెచఎన రాము, చంద్రమోహన, కౌన్సిలర్‌ రాఘవేంద్ర, టీడీపీ నాయకులు అమర్‌నాథ్‌, నెట్టేప్ప. బాబి, మోదాశివ, రామాంజినేయులు, విశ్వనాథ్‌రెడ్డి, నాగరాజు, ఫకృద్దీన, సురేష్‌, తిరుమలేష్‌, సుబ్బు, హనుమంతు పాల్గొన్నారు. Advertisement
Advertisement
Advertisement