బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి

ABN , First Publish Date - 2022-01-25T05:57:01+05:30 IST

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జాతీయ బాలలదినోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు.

బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి
బాలికకు సర్టిఫికెట్‌ అందజేస్తున్న కలెక్టర్‌




కామారెడ్డి, జనవరి 24: బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జాతీయ బాలలదినోత్సవానికి ఆయన హాజరై మాట్లాడారు. తల్లిదండ్రులు బాల, బాలికలను సమానంగా చూడాలని తెలిపారు. బాలికలు తమకు నచ్చిన లక్ష్యా న్ని ఎంచుకొని దానికి అనుగుణంగా చుదువుకొని సమాజంలో ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలని కోరారు. ప్రభుత్వం బాలిక సంరక్షణకు అదిక ప్రాధాన్యతను ఇస్తోందని తెలిపారు. అనంతరం క్రీడలు, పాటలు, సాంస్కృతిక రంగాల్లో రాణించిన బాలికలకు సర్టిఫికెట్లు, బహుమతులను అందజేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ పీడీ సరస్వతి  పాల్గొన్నారు.
అర్హులైన లబ్ధిదారుల పేర్లు నమోదుచేయాలి
గ్రామాల వారీగా దళితబంధు పథకం కోసం అర్హులైన లబ్ధిదారుల పేర్లను నమోదుచేయాలని కలెక్టర్‌ జితేష్‌ వి.పాటిల్‌ అన్నారు.సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌లో అధికారులతో మాట్లాడారు. ఈనెల 25లోగా పంచాయతీ కార్యదర్శులు లబ్ధిదారుల సంఖ్యను గుర్తించి జిల్లా స్థాయి అధికారులకు సమాచారం అందించాలని తెలిపారు. ప్రభుత్వం ప్రతి నియోజకవర్గానికి వంద యూనిట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. అదేవిధంగా తెలంగాణ రాజీవ్‌ స్వగృహ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ధరణి టౌన్‌షిప్‌ రిజిస్ట్రేషన్‌ రుసుం రూ.3000 దరఖాస్తు దారుడికి తిరిగి చెల్లించుటకు సంబంధిత పత్రాలతో ఈనెల 28 లోపు కలెక్టర్‌లోని హెచ్‌ సెక్షన్‌లో కలవాలని కలెక్టర్‌ తెలిపారు. సంబంధిత దరఖాస్తుదారులు ఈ సేవ రసీదు, ఆధార్‌కార్డు, బ్యాంక్‌ పాసుపుస్తకం,పాన్‌కార్డు జిరాక్స్‌ కాపిలతో దరఖాస్తు చేసుకున్నచో రుసుము తిరిగి చెల్లిస్తారని తెలిపారు. పూర్తి వివరాలకు 08468-220069 నెంబర్‌కు సంప్రదించాలని తెలిపారు.

Updated Date - 2022-01-25T05:57:01+05:30 IST