మహారాష్ట్రలో మరో బాలికపై అత్యాచారం

ABN , First Publish Date - 2021-09-13T07:47:47+05:30 IST

మహారాష్ట్రలో అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ముంబైలో ఓ మహిళ అత్యాచారానికి గురై మరణించిన ఘటన మరువక ముందే మళ్లీ ఓ బాలికపై అత్యాచారం జరిగింది..

మహారాష్ట్రలో మరో బాలికపై అత్యాచారం

  • సుత్తితో కొట్టి అకృత్యానికి పాల్పడిన దుండగుడు

ఠాణె/ముంబై, సెప్టెంబరు 12: మహారాష్ట్రలో అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది. శుక్రవారం ముంబైలో ఓ మహిళ అత్యాచారానికి గురై మరణించిన ఘటన మరువక ముందే మళ్లీ ఓ బాలికపై అత్యాచారం జరిగింది. రాష్ట్రంలో ఠాణె జిల్లా ఉల్హా్‌సనగర్‌లో రైల్వేస్టేషన్‌ ఆవరణలో గుర్తుతెలియని దుండగుడు ఓ బాలిక(15)పై సుత్తితో దాడి చేసి ఈ అకృత్యానికి పాల్పడ్డాడు. శుక్రవారం రాత్రి 9 గంటలకు ఈ దారుణం జరిగింది. బాధితురాలు షిరిడీ నుంచి తిరిగి వచ్చి.. ఉల్హా్‌సనగర్‌కు వెళ్లే లోకల్‌ రైలెక్కింది. ఉల్హా్‌సనగర్‌లో స్నేహితులతో కలిసి రైల్వేస్టేషన్‌లోని స్కైవాక్‌ మీదుగా ఇంటికి వెళ్తుండగా ఓ దుండగుడు సుత్తితో బెదిరించాడు. ఆమె స్నేహితులు పారిపోగా బాలిక అక్కడే చిక్కుకుంది. తర్వాత దుండగుడు ఆమె తలపై సుత్తితో కొట్టి, అత్యాచారం చేశాడు. రాత్రంతా ఆమెను అక్కడే బంధించి అకృత్యానికి పాల్పడుతూనే ఉన్నాడు. శనివారం తెల్లవారుజామున బాధితురాలు ఆ ప్రాంతం నుంచి ఎలాగోలా బయటపడింది. సమీపంలోని పోలీ్‌సస్టేషన్‌లో ఫిర్యా దు చేసేందుకు వెళ్లగా ఘటన జరిగిన ప్రాంతం త మ పరిధిలోకి రాదంటూ పోలీసులు తిరస్కరించారు. మరో స్టేషన్‌కు వెళ్లినా అదే అనుభవం ఎదురైంది. దీంతో రైల్వే పోలీసు అధికారులకు బాధితురాలు విషయం తెలిపింది. శనివారం రాత్రి నిందితుడిని ప్రత్యేక బృందం ఉల్హా్‌సనగర్‌లోనే అరెస్టు చేసింది. అతడిని శ్రీకాంత్‌ గైక్వాడ్‌(30)గా గుర్తించారు. కేసు నమోదు అనంతరం అతడిని స్థానిక కోర్టులో ప్రవేశపెట్టగా మంగళవారం వరకు పోలీసు కస్టడీలో ఉంచాలని కోర్టు ఆదేశించింది. కాగా, రాష్ట్రంలో గత కొద్ది రోజులుగా బాలికలు అత్యాచారం, హత్యకు గురయ్యారని, బాధితులు ఫిర్యాదు చేసిన వెంటనే పోలీసులు స్పందించాలని మహారాష్ట్ర డీజీపీ సంజయ్‌ పాండే ఆదేశించారు. నిందితులను తక్షణం అరెస్టు చేసి 60 రోజుల్లోపు చార్జిషీటు దాఖలు చేయాలని ఆదివారం ఫేస్‌బుక్‌లో ఆయన పోస్టు చేశారు. 


‘ముంబై’ బాధితురాలి కుటుంబానికి ఎన్సీడబ్ల్యూ బృందం పరామర్శ

ముంబై, సెప్టెంబరు 12: ముంబైలో మోహన్‌ చౌహాన్‌ అనే కామాంధుడి చేతిలో అత్యంత దారుణంగా అత్యాచారానికి గురై చనిపోయిన మహిళ (34) కుటుంబాన్ని జాతీయ మహిళా కమిషన్‌ (ఎ న్సీడబ్ల్యూ) బృందం ఆదివారం పరామర్శించింది. బృం దం సభ్యులు బాధితులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం సకినాక ప్రాంతంలో ఘటన జరిగిన స్థలాన్ని సభ్యులు పరిశీలించారు. ఆ తర్వాత సకినాక పోలీ్‌సస్టేషన్‌కు వెళ్లి కేసుపై ఆరా తీశారు.

Updated Date - 2021-09-13T07:47:47+05:30 IST