Abn logo
Jun 30 2020 @ 12:05PM

నెల రోజుల్లో పెళ్లి చేద్దామనుకున్నారు.. కానీ ఇంతలోనే ఆ యువతి..

ఐలాపూర్‌లో యువతి ఆత్మహత్య


లింగంపేట (నిజామాబాద్): వివాహానికి అప్పులు చేస్తున్నారని ఓ యువతి ఆ త్మహత్య చేసుకుంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా లింగంపేట మండలంలోని ఐలాపూర్‌ గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల  ప్రకారం.. బాలయ్య, గంగామణి కూతురు పైడాకుల మహేశ్వరి(18). లింగంపేట ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ పూర్తి చేసింది. తల్లిదండ్రులు ఆగస్టులో పెండ్లి చేయడానికి నిశ్చయించారు. కట్నకానుకలు, వివాహ ఖర్చుల కోసం తల్లిదండ్రులు అప్పులు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.


ఈ క్రమంలో తల్లిదండ్రులు ఈనెల 27న గొడవపడ్డారు. తన పెండ్లి కోసమే తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని మనస్థాపం చెంది క్రిమిసంహరక మందును తాగి ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు చికిత్సకోసం హైదరాబాద్‌కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుకెందర్‌రెడ్డి తెలిపారు. తన తోటి స్నేహితురాలు మృతి చెందడంలో కళాశాలకు చెందిన స్నేహితులు కన్నీరు పెట్టుకున్నారు.

Advertisement
Advertisement
Advertisement