బాలికపై ఏడాదిగా అత్యాచారం...

ABN , First Publish Date - 2020-05-29T23:49:48+05:30 IST

ఉపాధి కోసం నగరానికి వచ్చిన బాలికపై కామాంధులు కన్నేశారు. ఆమెకు మాయమాటలు చెప్పి మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించారు. అనంతరం గ్యాంగ్ రేప్ చేశారు. అదంతా వీడియోలు తీసి బెదిరించి ఏడాదిగా అత్యాచారం చేస్తున్నారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని భయపెట్టి తమ పశువాంఛ తీర్చుకుంటున్నారు. తీరా లాక్‌డౌన్‌తో బాలిక స్వగ్రామానికి వెళ్లిపోవడంతో ఆ వీడియోను వాట్సాప్ గ్రూప్‌లో వైరల్ చేసేశారు నీచులు.

బాలికపై ఏడాదిగా అత్యాచారం...

నోయిడా : ఉపాధి కోసం నగరానికి వచ్చిన బాలికపై కామాంధులు కన్నేశారు. ఆమెకు మాయమాటలు చెప్పి మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ తాగించారు. అనంతరం గ్యాంగ్ రేప్ చేశారు. అదంతా వీడియోలు తీసి బెదిరించి ఏడాదిగా అత్యాచారం చేస్తున్నారు. ఎవరికైనా చెబితే చంపేస్తామని భయపెట్టి తమ పశువాంఛ తీర్చుకుంటున్నారు. తీరా లాక్‌డౌన్‌తో బాలిక స్వగ్రామానికి వెళ్లిపోవడంతో ఆ వీడియోను వాట్సాప్ గ్రూప్‌లో వైరల్ చేసేశారు నీచులు.


ఈ దారుణ ఘటన యూపీలోని నోయిడాలో చోటుచేసుకుంది. దళిత మైనర్ బాలిక(17)ను ఇద్దరు కామాంధులు గ్యాంగ్ రేప్ చేసిన ఘటన వెలుగుచూసింది. ఉపాధి కోసం నోయిడాకి వచ్చిన అక్కాచెల్లెళ్లు ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన చాండ్ అలిచాస్ ముర్సాలిన్, షాన్ అలియాస్ సోను పదిహేడేళ్ల ఆ బాలికపై కన్నేశారు. అదను చూసి బాలికకు మత్తుమందు కలిపిన కూల్‌డ్రింక్ ఇచ్చి ఆమె మత్తులోకి జారుకున్నాక కీచకపర్వానికి తెరలేపారు.


ఆమెను రేప్ చేస్తున్న సమయంలో తీసిన వీడియోని వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేసేశారు. దీంతో ఆమె సోదరుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు యువకులనూ పోలీసులు అరెస్టు చేశారు. గ్యాంగ్ రేప్, పోక్సో, ఎస్సీ, ఎస్టీ చట్టం కింద కేసులు నమోదు చేసి జైలుకి పంపారు.

Updated Date - 2020-05-29T23:49:48+05:30 IST