శ్రీశైలంలో గిరి ప్రదక్షిణ

ABN , First Publish Date - 2022-08-12T05:56:19+05:30 IST

శ్రీశైల క్షేత్రంలో శ్రావణ శుద్ధ పౌర్ణమిని పురష్కరించుకొని శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది.

శ్రీశైలంలో గిరి ప్రదక్షిణ
గిరి ప్రదక్షిణలో ఈవో, అర్చకులు

శ్రీశైలం, ఆగస్టు 11: శ్రీశైల క్షేత్రంలో శ్రావణ శుద్ధ పౌర్ణమిని పురష్కరించుకొని శ్రీశైల గిరిప్రదక్షిణ కార్యక్రమాన్ని దేవస్థానం ఘనంగా నిర్వహించింది. సాయంత్రం స్వామిఅమ్మవార్ల మహామంగళహరతుల అనంతరం శ్రీస్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకిలో ఊరేగింపుతో గిరిప్రదక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సాయంత్రం భ్రమరాంబ అమ్మవారికి లక్ష కుంకు మార్చనను నిర్వహించారు. భక్తులు పాల్గొనేందుకు దేవస్థానం పరోక్ష సేవ ద్వారా అవకాశం కల్పించింది. లక్షకుంకుమార్చనలో ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్రల నుంచి భక్తులు ఈ పరోక్షసేవలో మొత్తం 113 మంది భక్తులు పాల్గొన్నారు. శ్రీశైలక్షేత్రానికి స్వయంగా విచ్చేయలేని భక్తులు వారి గోత్రనామాలతో ఆయా ఆర్జితసేవలలో పాల్గొనేందుకు ఆన్‌లైన్‌ ద్వారా రూ.1,116   సేవారుసుమును చెల్లించి పరోక్షసేవలో పాల్గ్గొనవచ్చును. భక్తులు ఈ పరోక్షసేవ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని దేవస్థానం ఈవో ఎస్‌.లవన్న కోరారు. స్వామిఅమ్మవార్లకు ఊయలసేవ, పల్లకి ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. దత్తాత్రేయస్వామికి విశేష అభిషేక పూజలు నిర్వహించారు.  శ్రీశైల దేవస్థానం ధర్మపథంలో భాగంగా గురువారం సాయంత్రం నిత్యకళారాధన వేదిక వద్ద కడపకు చెందిన కె.అక్షర బృందంచే గాత్రకచ్చేరి కార్యక్రమం నిర్వహించింది.

Updated Date - 2022-08-12T05:56:19+05:30 IST