భారత్‌లోనే రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తి!!

ABN , First Publish Date - 2020-05-31T08:40:19+05:30 IST

కరోనా చికిత్సకు వినియోగిస్తున్న యాంటీ వైరల్‌ ఔషధం రెమ్‌డెసివిర్‌కు మార్కెటింగ్‌ అనుమతులు కోరుతూ అమెరికాకు చెందిన గిలీడ్‌ సైన్సెస్‌ కంపెనీ భారత్‌కు దరఖాస్తు...

భారత్‌లోనే రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తి!!

  • అనుమతి కోరుతూ సీడీఎ్‌ససీవోకు గిలీడ్‌ సైన్సెస్‌ దరఖాస్తు


న్యూఢిల్లీ, మే 30 : కరోనా చికిత్సకు వినియోగిస్తున్న యాంటీ వైరల్‌ ఔషధం రెమ్‌డెసివిర్‌కు మార్కెటింగ్‌ అనుమతులు కోరుతూ అమెరికాకు చెందిన గిలీడ్‌ సైన్సెస్‌ కంపెనీ భారత్‌కు దరఖాస్తు చేసుకుంది. తమ తరఫున భారత్‌లో సిప్లా, జుబిలంట్‌ లైఫ్‌ సైన్సెస్‌, హెటెరో ల్యాబ్స్‌లు ‘రెమ్‌డెసివిర్‌’ను ఉత్పత్తి చేసి, విక్రయించేందుకు అనుమతులు ఇవ్వాలంటూ సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌(సీడీఎ్‌ససీవో)కు విజ్ఞప్తి చేసింది. 


Updated Date - 2020-05-31T08:40:19+05:30 IST