ఘనంగా పెద్దాపూర్‌ మల్లన్న బోనాల జాతర

ABN , First Publish Date - 2021-03-29T06:20:01+05:30 IST

మండలంలోని పెద్దాపూర్‌ గ్రామంలో మల్లన్న స్వామి జాతర ఆది వారం వైభవంగా జరిగింది.

ఘనంగా పెద్దాపూర్‌ మల్లన్న బోనాల జాతర
పెద్దాపూర్‌లో బోనాలతో మల్లన్న ఆలయం చుట్టు ప్రదక్షణ చేస్తున్న భక్తులు

- 60వేల మంది భక్తులు ఒకే సారి ప్రదక్షిణలు 

మెట్‌పల్లి రూరల్‌, మార్చి 28: మండలంలోని పెద్దాపూర్‌ గ్రామంలో మల్లన్న స్వామి జాతర ఆది వారం వైభవంగా జరిగింది. ఈ సందర్భగా తెలం గాణలోని జిల్లాలతో పాటు మహారాష్ట్ర, ఛతీస్‌ఘడ్‌, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి అధికసంఖ్య లో భక్తులు పాల్గొన్నారు. ఉదయం నుంచి భక్తులు భక్తిశ్రద్ధలతో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. డప్పు చప్పుల్లుతో శివసత్తుల పూ నకాలు, పోతురాజుల విన్యాసాల మధ్య శోభా యాత్రగా ఆలయానికి చేరుకొని సుమారు 60వేల మంది భక్తులు ఒకే సారి ప్రదక్షిణలు చేసి బోనాల ను సమర్పించారు.  కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల వి ద్యాసాగర్‌రావు-సరోజన దంపతులు పాల్గొని నియో జకవర్గ ప్రజలను చల్లంగా చూడాలని మొక్కులు చెల్లించారు.  జడ్పీటీసీ కాటపెల్లి రాధ-శ్రీనివాస్‌రెడ్డి బోనమెత్తుకొని స్వామివారికి సమర్పించి మొక్కు లను చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారి ఉ త్సవమూర్తులతో రథోత్సవ కార్యక్రమాన్ని చేపట్టా రు. అలాగే ఆలయానికి వచ్చే భక్తులకు ఎమ్మెల్యే మాస్కులను పంపిణీ చేశారు. మెట్‌పల్లి, కోరుట్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్లు రాణవేణి సుజాత-సత్యనా రాయణ, అన్నం లావణ్య-అనిల్‌, సర్పంచులు కోరె పు రవి, పీసు తిరుపతిరెడ్డి, బద్దం శేఖర్‌రెడ్డి, ఉపస ర్పంచ్‌ తేలుకంటి రాజేందర్‌, ఎంపీటీసీ తేలుకంటి శంకరయ్య, ఆలయాభివృద్ది కమిటీ చైర్మన్‌ దోతుల రమేశ్‌, ఆలయాభివృద్ది, గ్రామాభివృద్ది కమిటీ సభ్యు లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-29T06:20:01+05:30 IST