బదిలీనా.. అయితే

ABN , First Publish Date - 2021-08-10T05:02:16+05:30 IST

మీ రు బదిలీ చేస్తే.. మేము వెళ్లాలా. అదెలా కుదు రుతుంది.. మా ఇష్టం. మేం వెళ్లం. మేం ఇక్కడే పనిచేస్తాం. ఇదీ జీజీహెచ్‌ పరిపాల నా విభాగంలోని సిబ్బంది ధోర ణి.

బదిలీనా..  అయితే

జీజీహెచ్‌లో సీటు మారని సిబ్బంది

హాస్యాస్పదంగా అంతర్గతబదిలీల ప్రక్రియ

గత నెల 18న ఆదేశాలిచ్చినా పట్టించుకోని వైనం

పరిపాలనా విభాగంలో కొన్నేళ్లుగా ఒకే సీటులో పలువురి తిష్ట


గుంటూరు(జీజీహెచ్‌), ఆగస్టు 9: మీ రు బదిలీ చేస్తే.. మేము వెళ్లాలా. అదెలా కుదు రుతుంది.. మా ఇష్టం. మేం వెళ్లం. మేం ఇక్కడే పనిచేస్తాం. ఇదీ జీజీహెచ్‌ పరిపాల నా విభాగంలోని సిబ్బంది ధోర ణి. గుంటూ రు ప్రభుత్వాసుపత్రిలో గత నెలలో జరిగిన అంతర్గత బదిలీల ప్రక్రియ హాస్యాస్పదంగా మారింది. జీజీహెచ్‌ పరిపాలనా విభాగంలో కొన్నేళ్లుగా ఒకే సీటులో పని చేస్తున్న వారి పై అవినీతి ఆరోపణలు, ఫిర్యాదులు ఉన్నా యి. ఈ క్రమంలో  జేసీ ప్రశాంతికి కొన్ని విభాగాలపై ఫిర్యాదులు వెళ్లాయి. ముఖ్యం గా ఎంఆర్‌పీ, మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ విభాగం వంటి కీలక విభాగాల పై ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో   అంతర్గత బదిలీలు చేయాలని సూపరిం టెండెంట్‌కు  జేసీ సూచించారు. దీంతో  సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రభావతి గత నెల 18న ఆయా విభాగాల్లోని 20 మంది ని బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అయితే జీ శ్రీనివాస్‌ అనే జూనియర్‌ అసి స్టెంట్‌ సీటు మారడం ఇష్టం లేదని సూప రింటెండెంట్‌ చాంబర్‌లోనే ఆత్మహత్యాయ త్నానికి పాల్పడ్డారు. దీంతో బదిలీల ప్రక్రి య పక్కన పెట్టేశారే కాని  అధికారికంగా ఎక్కడా చెప్పలేదు. ఆదేశాలు జారీ చేసి మూడు వారాలు దాటుతున్నా ఎవ్వరూ కొత్త స్థానాల్లోకి వెళ్ళి రిపోర్టు చేయలేదు. నగదు ఎక్కువ వచ్చే సీట్లను వదిలేందుకు సిబ్బంది ఇష్టపడటం లేదని అందువల్లే బదిలీ అయినా ఆయా స్థానాలకు వెళ్లడం లేదని జీజీహెచ్‌లో చర్చనడుస్తోంది.  కొత్త స్థానంలో చేయాల్సిన పనిపై అంతగా నైపు ణ్యం లేదని అందువల్ల బదిలీఅయిన సీటు లోకి వెళ్లేందుకు వెనుకంజ కొం దరు వెన కంజవేస్తున్నారని సమాచారం. ఈ పరిస్థి తుల్లో బదిలీలపై కీలకమైన వి భాగాలకు చెందిన 8 మంది ఓ ప్రజా ప్రతినిధి ద్వారా జేసీనీ ఆశ్రయించినట్లు సమాచారం.

Updated Date - 2021-08-10T05:02:16+05:30 IST