హైపర్‌టెన్షన్‌ అటెన్షన్‌

ABN , First Publish Date - 2022-08-23T18:10:16+05:30 IST

35 ఏళ్ల వయసు నుంచి నెలకొకసారి బీపీ చెక్‌ చేయించుకుంటూ ఉండాలి. లక్షణాలు కనిపించలేదు

హైపర్‌టెన్షన్‌ అటెన్షన్‌

35 ఏళ్ల వయసు నుంచి నెలకొకసారి బీపీ చెక్‌ చేయించుకుంటూ ఉండాలి. లక్షణాలు కనిపించలేదు కదా అని రక్తపోటు కలిగి ఉండీ, బీపీని పరీక్షించుకోవటం నిర్లక్ష్యం చేస్తే... అంతర్లీనంగా జరగరాని నష్టం జరిగిపోతుంది. రక్తపోటును అలాగే వదిలేస్తే ఒత్తిడి పెరిగి గుండె పరిమాణం పెరుగుతుంది. ఈ పరిస్థితి ఎక్కువ కాలం కొనసాగితే హార్ట్‌ ఫెయిల్‌ అవ్వొచ్చు. అంతే కాకుండా మూత్రపిండాలు కూడా ఫెయిల్‌ అవ్వొచ్చు. మెదడులోని రక్తనాళాల్లో ప్రెషర్‌ పెరిగిపోయి లేదా రక్తనాళాలు చిట్లిపోయి పెరాలసిస్‌ స్ట్రోక్‌కి కూడా గురి కావచ్చు. కాబట్టి అధిక రక్తపోటు నిర్థారణ అయిన వాళ్లు, క్రమం తప్పకుండా మందులు వాడుకుంటూ బిపి పరీక్షించుకుంటూ ఉండాలి. 


హైవర్‌టెన్షన్‌ అదుపులో ఉండాలంటే?

  • రక్తపోటు అదుపులో ఉంచుకోవటం మన చేతుల్లో పనే! ఇందుకోసం అనుసరించివలసిన నియమాలు...
  • మందులు సక్రమంగా వాడుకోవాలి. రక్తపోటుకు చికిత్స దీర్ఘకాలం కొనసాగుతుంది కాబట్టి వైద్యులు సూచించినంత కాలం క్రమం తప్పకుండా మందులు వాడాలి. 
  • ఉప్పు ఎక్కువగా ఉండే నిల్వ పచ్చళ్లు, అప్పడాలు, సోడా ఉప్పు వేసి వండిన వడలు, గారెలు, బజ్జీలు, బ్రెడ్‌, బిస్కెట్లు, కేక్‌లు లాంటివి తినకూడదు. అలాగే సాల్టెడ్‌ చిప్స్‌, బిస్కెట్లు కూడా మానేయాలి. 
  • వ్యాయామం చేయటం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ప్రతిరోజూ కనీసం అరగంట పాటైనా నడక లేదా జాగింగ్‌ చేయాలి.

Updated Date - 2022-08-23T18:10:16+05:30 IST