కోవిడ్-19 గతం కన్నా వేగంగా వ్యాపిస్తోంది : జర్మనీ ఛాన్సలర్

ABN , First Publish Date - 2020-10-25T02:09:14+05:30 IST

కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు ఈ ఏడాది ప్రారంభంలో కన్నా ఎక్కువ వేగంతో వ్యాపిస్తున్నట్లు

కోవిడ్-19 గతం కన్నా వేగంగా వ్యాపిస్తోంది : జర్మనీ ఛాన్సలర్

బెర్లిన్ : కోవిడ్-19 ఇన్ఫెక్షన్లు ఈ ఏడాది ప్రారంభంలో కన్నా ఎక్కువ వేగంతో వ్యాపిస్తున్నట్లు జర్మనీ ఛాన్సలర్ ఏంజెలా మెర్కెల్ శనివారం చెప్పారు. ఈ పరిస్థితిని పరిశీలించినపుడు జర్మనీ రాబోయే నెలల్లో మరింత ఎక్కువ ఇబ్బందులను ఎదుర్కొనవలసి వస్తుందని తెలుస్తోందన్నారు. దేశ ప్రజలను ఉద్దేశించి శనివారం ఆమె మాట్లాడుతూ, జర్మనీకి రాబోయే నెలలు మరింత ఇబ్బందికరంగా ఉండబోతున్నట్లు హెచ్చరించారు. 


కోవిడ్ మహమ్మారి అత్యంత తీవ్ర దశలో ఉందని చెప్పారు. కొత్త కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని చెప్పారు. ఈ మహమ్మారి మళ్ళీ వేగంగా వ్యాపిస్తోందన్నారు. ఆరు నెలల క్రితం ప్రారంభమైనప్పటి కన్నా వేగంగా వ్యాపిస్తోందన్నారు. జర్మనీకి సాపేక్షంగా హాయిగా ఉండే వేసవి కాలం ముగిసిందన్నారు. ప్రజల చర్యలపైనే చలి కాలం గడవడం, క్రిస్ట్‌మస్‌ని జరుపుకోవడం ఆధారపడి ఉంటుందన్నారు. ఔట్‌డోర్ మీటింగ్స్, ట్రావెలింగ్స్ తగ్గించాలని ప్రజలను కోరారు.


Updated Date - 2020-10-25T02:09:14+05:30 IST