కలసికట్టుగా పోరాడుదాం.. జెన్‌కోను కాపాడుకుందాం !

ABN , First Publish Date - 2022-03-08T03:39:56+05:30 IST

కలసికట్టుగా పోరాటం చేసి జెన్‌కో థర్మల్‌ కేంద్రాన్ని కాపాడుకుందామని విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ, కాంట్రాక్టు కార్మికుల ఐక్యవే

కలసికట్టుగా పోరాడుదాం.. జెన్‌కోను కాపాడుకుందాం !
అర్ధనగ్న ప్రదర్శనతో జెన్‌కో ఉద్యోగులు, కార్మికులు

ముత్తుకూరు, మార్చి7: కలసికట్టుగా పోరాటం చేసి జెన్‌కో థర్మల్‌ కేంద్రాన్ని కాపాడుకుందామని విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ, కాంట్రాక్టు కార్మికుల ఐక్యవేదిక జేఏసీలు పిలుపునిచ్చాయి నేలటూరులోని శ్రీదామోదరం సంజీవ య్య థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం(జెన్‌కో) పైవేటీకరణకు వ్యతిరేకంగా సోమవారం ఉద్యోగులు, కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నీ సంఘాలు సంఘటితంగా పోరాటం చేస్తేనే ప్రభుత్వానికి ఉద్యమ తీవ్రత తెలుస్తుందన్నారు.  జిల్లాలోని ఎమ్మెల్యేలు జెన్‌కోను ప్రైవేటీకరించకుండా అడ్డుకునేందుకు సీఎంతో మాట్లాడి కృషి చేయాలన్నారు. లేనిపక్షంలో భవిష్యత్తులో ప్రజాగ్రహానికి గురి కావా ల్సివస్తుందన్నారు.  కార్యక్రమంలో జెన్‌కో ఉద్యోగుల జేఏసీ నాయకులు గుమ్మడి శ్రీనివాసులు, మునిప్రసాద్‌, కాంట్రాక్టు కార్మికుల ఐక్యవేదిక జేఏసీ నాయకులు, జెన్‌కో ఇంజనీర్లు పాల్గొన్నారు. 



 జెన్‌కో ప్రైవేటీకరణను ఆపాలి


బుచ్చిరెడ్డిపాళెం, మార్చి7:  జెన్‌కో ఽథర్మల్‌ పవర్‌ స్టేషన్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని సీఐటీయూ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మునీర్‌ అహ్మద్‌, చల్లకొలుసు మల్లికార్జునలు డిమాండ్‌ చేశారు. ఈమేరకు వారు సోమవారం తహసీల్దారు కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో  సీఐటీయూ నాయకులు జానీబాషా, పీ శ్రీనివాసులు, నజీర్‌బాషా, మల్లికార్జున, రాధయ్య, రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-03-08T03:39:56+05:30 IST