Abn logo
Apr 12 2021 @ 22:51PM

మహబూబ్‌నగర్‌-చించోళి రహదారి గెజిట్‌ విడుదల

మహబూబ్‌నగర్‌, ఏప్రిల్‌ 12: మహబూబ్‌నగర్‌- చించోళి రహదారిని జాతీ య రహదారిగా చేసేందుకు కేంద్రప్రభుత్వం గెజిట్‌ విడుదల చేసింది. త్వర లోనే మహబూబ్‌నగర్‌- హన్వాడ-కోస్గి-తాండూర్‌-చించోళి రహదారి జాతీయ రహదారిగా రూపుదిద్దుకోబోతుంది. ఈ రహదారి కోసం మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ గతేడాది నవంబర్‌లో నేషనల్‌ హైవే అథారిటీ కార్యదర్శి, మినిస్ట్రీ ఆఫ్‌ ట్రాన్స్‌ పోర్ట్‌ అండ్‌ హైవేస్‌కు లేఖ రాశారు. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ముఖ్యమంత్రి ఈ ఏడాది మార్చిలో కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. వెంటనే స్పందించిన కేంద్రమంత్రి గడ్కరి నోటిఫై జారీ చేశారని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రంలోని అన్ని రహదారులను అద్భుతమైన రహదారులుగా మా ర్చేందుకు చేస్తున్న కృషి ఫలిస్తోందని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. సీఎం సూచన మేరకు కేంద్ర మంత్రి గడ్కరి గెజిట్‌ విడుదల చేయడం అభినందనీయమన్నారు. జిల్లా ప్రజల తరపున ముఖ్యమంత్రి కేసీఆ ర్‌, కేంద్ర ఉపరితల శాఖ మంత్రి గడ్కరి, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డికి మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ కృతజ్ఞతలు తెలిపారు. 

Advertisement
Advertisement