నృత్యాభినయనం చేస్తున్న విద్యార్ధులు
గుంటూరు(సాంస్కృతికం), మే 27: బృందావన్ గార్డెన్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణం అన్నమయ్య కళావేదికపై కేఆర్కే ఈవెంట్స్ నిర్వహణలో ఎన్టీఆర్ కళాపరిషత్ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ శతజయంతి సంబరాల్లో భాగంగా శుక్రవారం ప్రదర్శించిన వృద్దోపనిషత్ నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జరిగిన సభకు సంస్థ వ్యవస్థాపకులు రామకృష్ణప్రసాద్ కాట్రగడ్డ అధ్యక్షత వహించారు. సభలో ఆలయ కమిటీ సహాయ కార్యదర్శులు పి.ప్రభాకరరావు, వూటుకూరి నాగేశ్వరరావు, అడపా శివప్రసాద్, జీవీఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొని ప్రసంగించారు. అనంతరం ఎండీ గిరి శిష్యబృందం పలు కీర్తనలకు కూచిపూడి నృత్యాన్ని ప్రదర్శించారు.