జిల్లాకు.. 78,500 డోసులు

ABN , First Publish Date - 2021-01-27T05:24:50+05:30 IST

జిల్లాకు కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులు 78,500 సరఫరా జరిగి నట్లు కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. 72వ గణ తంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరులోని పోలీసు పరేడ్‌గ్రౌండ్స్‌లో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు.

జిల్లాకు.. 78,500 డోసులు
ప్రసంగిస్తున్న కలెక్టర్‌ శ్యామ్యూల్‌ ఆనంద్‌ కుమార్‌

ఆశాజనకంగా వ్యాక్సినేషన్‌ పురోగతి

జిల్లా వ్యాప్తంగా 179 టీకా కేంద్రాల ఏర్పాటు

దశల వారీగా ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కి టీకాలు

గణతంత్ర దినోత్సవంలో కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ 


 గుంటూరు, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాకు కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ డోసులు 78,500 సరఫరా జరిగి నట్లు కలెక్టర్‌ ఆనంద్‌కుమార్‌ తెలిపారు. 72వ గణ తంత్ర దినోత్సవం సందర్భంగా గుంటూరులోని పోలీసు పరేడ్‌గ్రౌండ్స్‌లో  నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొని త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేశారు. అనంతరం పోలీసులు, ఎన్‌సీసీ క్యాడెట్ల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా గణ తంత్ర దినోత్సవ సందేశాన్నిస్తూ తొలి విడతగా వైద్య ఆరోగ్య శాఖకు చెందిన 16,148 మంది ప్రభుత్వ, 17,360 మంది ప్రైవేటు, 4,704 మంది అంగన్‌వాడీ సిబ్బందికి వ్యాక్సిన్‌ వేస్తున్నామన్నారు. మలివిడతలో 4,215 మంది రెవెన్యూ, 6,033 మంది పోలీసు, 11,815 మంది పురపాలక, 22,506 మంది పంచా యతీ సిబ్బందికి ఇస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా 179 కొవిడ్‌ వ్యాక్సిన్‌ టీకా కేంద్రాలు ఏర్పాటు చేసి ఇప్పటివరకు 10,352 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు తెలిపారు. కరోనా రెండో దశ స్ట్రెయిన్‌ కేసు ఒక్కటి కూడా జిల్లాలో ఇప్పటివరకు నమోదు కాలేదని తెలిపారు.


శాఖల పురోగతి ఇలా..

కలెక్టర్‌ తన సందేశంలో వివిధ ప్రభుత్వ శాఖలు, సంస్థల పురోగతిని గణాంకాలతో వివరించారు. పేదలందరికీ ఇళ్ల పథకం కింద జిల్లాలో 2,84,365 మందికి నివేశన స్థలాలను పంపిణీ చేశామన్నారు. ఇందుకోసం 1,705 ఎకరాల ప్రభుత్వ భూమి, 4,543 ఎకరాల ప్రైవేటు భూమిని వినియోగించామన్నారు.  ఇందుకు రూ.1,960.60 కోట్లు వెచ్చించడం ఒక చరిత్రగా పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో రెండు విడతలుగా వారందరికీ పక్కా గృహాలు మం జూరు చేసి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయిస్తామ న్నారు.  వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూహక్కు, భూరక్ష పథకం కింద జిల్లాలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో భూముల సర్వేకి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. తొలి విడతలో 227 గ్రామాల్లో ఉన్న 4.75 లక్షల ఎకరాల భూమి సర్వే నిర్వహించేందుకు 995 బృందాలను నియమించామన్నారు. ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి ఇంటి వద్దకే రేషన్‌ సరుకులు తీసుకొచ్చి పంపిణీ చేసేందుకు 899 మొబైల్‌ డిస్పెన్సింగ్‌ యూనిట్లను లబ్ధిదారులకు సబ్సిడీపై కేటాయించి నట్లు చెప్పారు. స్వచ్ఛ గుంటూరు కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైఎస్‌ఆర్‌ రైతుభరోసా ద్వారా ప్రతీ ఏటా పెట్టుబడి సాయం కింద పీఎం కిసాన్‌తో కలిపి ఈ సంవత్సరంలో 4.59 లక్షల మందికి రూ.643 కోట్లు రైతుల ఖాతాలో జమ చేశా మన్నారు. అమూల్‌ సంస్థ భాగస్వామ్యంలో 831 పాల శీతలీకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి, పాల సేకరణ చేసి  లీటర్‌కి అదనంగా రూ.5 నుంచి 7 వచ్చేలా చర్యలు చేపట్టామన్నారు. చేపల వేట నిషేఽ ద సమయంలో వైఎస్‌ఆర్‌ మత్స్యకార భరోసా పథ కం ద్వారా జిల్లాలో 8,300 మంది మత్స్యకారులకు రూ.8.30 కోట్లు వారి బ్యాంకు ఖాతాలను జమ చేశా మన్నారు. కొండవీడు నగర వనాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా రూపుదిద్దేందుకు రూ.13.35 కోట్లతో ప్రణాళికకు ఆమోదం వచ్చిందన్నారు. ఈ సంవత్సరం రూ.6.50 కోట్లతో చేపట్టిన పనులు పు రోగతిలో ఉన్నాయన్నారు. గుంటూరు చానల్‌ పొడి గింపు, వైఎస్‌ఆర్‌ పల్నాడు దుర్భిక్ష నివారణ పథకం, వరికపూడిశెల ఎత్తిపోతల పథకం పనులను రూ.7,018 కోట్లతో చేపట్టనున్నామన్నారు.  ఏపీఎస్‌ ఐడీసీ ద్వారా 15 ఎత్తిపోతల పథకాల నిర్మాణం చేపట్టి వచ్చే ఖరీఫ్‌ నాటికి 43,743 ఎకరాలకు సాగునీటి వసతి కల్పిస్తామన్నారు. గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ ద్వారా ఎన్‌ ఆర్‌డీడబ్ల్యూపీ, జలజీవన్‌ మిషన్‌ కింద తాగునీటి పథకాల నిర్మాణాలు చేప ట్టామన్నారు. జిల్లా నీటియాజమాన్య సంస్థ ద్వారా 5.69 లక్షల కుటుంబాల కు జాబ్‌ కార్డులు జారీ చేసి ఉపాధి కల్పిస్తోన్నామన్నారు. రోడు,్ల భవనాల శాఖ ద్వారా రూ.27.31 కోట్లతో గుం టూరు నగరంలో రెండు రహదారు లను విస్తరిస్తున్నామన్నారు. సీఆర్‌ఎఫ్‌ కింద మూడు పనులను రూ.86.20 కోట్లతో చేపట్టామన్నారు. నగరపా లకసంస్థ ద్వారా అమృత్‌ పథకం కింద రూ.33.53 కోట్లతో గోరంట్లలో జీఎల్‌బీఆర్‌, ఈఎల్‌ఎస్‌ఆర్‌ నిర్మా ణం చేపట్టామన్నారు. 14వ ఆర్థిక సంఘం నుంచి రెండో విడత మంజూరైన రూ.104 కోట్లను గ్రామ పంచాయతీలకు సర్దుబా టు చేశామన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధుల్లో తొలి విడతగా రూ.79.67 కోట్లను 1,042 గ్రామాలకు సర్దుబాటు చేశామన్నారు.  వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ ద్వారా జిల్లాలో 3.70 లక్షల మందికి రూ.999.73 కోట్ల విలువైన శస్త్ర చికిత్సలు చేయించామన్నారు.  జీజీహెచ్‌లో 100 పడకల ఐసీ యూలతో 20 కిలోలీటర్ల ఆక్సీజన్‌ సరఫరాతో దాదాపు 4,500 మం ది కొవిడ్‌ బాధితులకు చికిత్స అందించామన్నారు. 3.80 లక్షల మం ది విద్యార్థులకు రూ.56.65 కోట్లు విలువ చేసే జగనన్న విద్యా కానుక కిట్లు, అమ్మఒడి పథకం ద్వారా జిల్లాలో 6.71 లక్షల మంది తల్లులకు రూ.14 వేల వంతున రూ. 562.74 కోట్లు జమ చేశా మన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు ఆళ్ల అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు, ఎమ్మెల్యేలు మద్ధాళి గిరిధర్‌, మహమ్మద్‌ ముస్తఫా, ఉండవల్లి శ్రీదేవి, అర్బన్‌, రూరల్‌ ఎస్పీలు అమ్మిరెడ్డి, విశాల్‌ గున్నీ, జేసీలు ఏఎస్‌ దినేష్‌కుమార్‌, పీ ప్రశాంతి, కే శ్రీధర్‌రెడ్డి, డీఆర్‌వో సీ చంద్రశేఖర్‌రెడ్డి, స్వాతంత్య్ర సమర యోధులు పాల్గొన్నారు.



Updated Date - 2021-01-27T05:24:50+05:30 IST