Resignation: టీడీపీకి గంజి చిరంజీవి రాజీనామా

ABN , First Publish Date - 2022-08-10T16:58:09+05:30 IST

టీడీపీ గంజి చీరంజీవి రాజానీమా చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి పదవికి, పార్టీ సభ్యతనికి రాజీనామా చేస్తున్నట్లు చిరంజీవి తెలిపారు.

Resignation: టీడీపీకి గంజి చిరంజీవి రాజీనామా

గుంటూరు: టీడీపీ గంజి చీరంజీవి(Ganji chiranjeevi) రాజీనామా చేశారు. టీడీపీ (TDP) అధికార ప్రతినిధి పదవికి, పార్టీ సభ్యతనికి రాజీనామా (Resign) చేస్తున్నట్లు చిరంజీవి తెలిపారు. టీడీపీలో మున్సిపల్ చైర్మన్‌గా, 2014లో ఎమ్మెల్యే అభ్యర్ధిగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు.  తెలుగుదేశం పార్టీలో బీసీగా ఉన్న తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టారన్నారు. 2014లో తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమని ఆరోపించారు. పదవులు కోసం, పరపతి కోసం టీడీపీకి రాజీనామా చేయడం లేదని...  సొంత పార్టీ నేతల వెన్నుపోట్లు భరించలేక రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ వాళ్ళే తన రాజకీయ జీవితం నాశనం చేశారన్నారు. చివరి నిమిషం వరకు మంగళగిరి ఎమ్మెల్యే సీటు తనదే అని చెప్పి మోసం చేశారని తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనే పదవి ఇచ్చి... మంగళగిరి ప్రజలకు దూరం చేశారన్నారు. చేనేత, బీసీగా ఉన్న తనను అణగదొక్కారని మండిపడ్డారు. ‘‘నా ఆవేదన, బాధ నాయకులకు తెలిసినా నన్ను పట్టించుకోలేదు. ఎస్సీ,ఎస్టీ, బీసీలకు న్యాయం చేసే వారితోనే నడుస్తాను. అందరిని సంప్రదించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటా’’ అని చిరంజీవి పేర్కొన్నారు. 

Updated Date - 2022-08-10T16:58:09+05:30 IST