కోవిడ్-19: ఒకే జిల్లాలో 7 లక్షల కుటుంబాలకు ఆరోగ్య పరీక్షలు..

ABN , First Publish Date - 2020-04-09T01:24:46+05:30 IST

కోవిడ్-19 వ్యాప్తికి చెక్ పెట్టేందుకు ఒడిశాలోని గంజాం జిల్లా యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుంది...

కోవిడ్-19: ఒకే జిల్లాలో 7 లక్షల కుటుంబాలకు ఆరోగ్య పరీక్షలు..

భువనేశ్వర్: కోవిడ్-19 వ్యాప్తికి చెక్ పెట్టేందుకు ఒడిశాలోని గంజాం జిల్లా యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుంది. జిల్లా వ్యాప్తంగా ఇంటింటికీ వెళ్లి దాదాపు 7 లక్షల కుటుంబాలకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ విజయ్ అమృత కులాంగె వెల్లడించారు. ఇప్పటి వరకు ఒడిశాలో 42మందికి కోవిడ్-19 సోకగా.. సోమవారం తొలి కరోనా మరణం నమోదైంది. సోమవారం మృతిచెందిన 72 ఏళ్ల ఓ వృద్ధుడి నమూనాలు సేకరించి కోవిడ్-19 పరీక్షలు నిర్వహించడంతో వైరస్ సోకినట్టు తేలింది. కాగా దేశ వ్యాప్తంగా గత 24 గంటల్లో 773 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు  కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. వీటితో కలిపి ప్రస్తుతం ఈ మహమ్మారి బారిన పడిన వారి సంఖ్య 5,194కు చేరినట్టు తెలిపింది. 

Updated Date - 2020-04-09T01:24:46+05:30 IST