గంజాయి రూట్లలో పైలెట్లు

ABN , First Publish Date - 2021-10-28T06:46:26+05:30 IST

చీకటి వ్యాపారాలు చేస్తూ కోట్ల కొద్దీ సొమ్మును ఆర్జించే స్మగ్లర్లు పోలీసు నిఘా కళ్ల నుంచి తప్పించుకునేందుకు రకరకాల వ్యూహాలను ఎంచుకుంటున్నారు.

గంజాయి రూట్లలో పైలెట్లు
గంజాయితో పోలీసులు

  తరలింపులో వీరే కీలకం
  పైలట్‌కు రూ.లక్షల్లో ఒప్పందం
  మూడు నెలల్లో 12 వేల కిలోలు స్వాఽధీనం.. 83 మంది అరెస్టు, 36 వాహనాలు సీజ్‌
  తాజాగా రూ.2 కోట్ల విలువైన రెండు వేల కిలోలు స్వాధీనం


చింతూరు, అక్టోబరు 27 : చీకటి వ్యాపారాలు చేస్తూ కోట్ల కొద్దీ సొమ్మును ఆర్జించే స్మగ్లర్లు పోలీసు నిఘా కళ్ల నుంచి తప్పించుకునేందుకు రకరకాల వ్యూహాలను ఎంచుకుంటున్నారు. ఇందులో ఒకటిగా పైలటింగ్‌ వ్యవస్థను పటిష్టంగా ఏర్పాటుచేసుకున్నా రు. ఆ వ్యవస్థకు సంఘంలో కాస్త పలుకుబడి ఉన్న వ్యక్తులైతే ఇంకా సులువుగా, ఎవరికీ అనుమానం రాకుండా ఉంటుందని స్మగ్లర్లు వ్యూహం రచించుకు న్నట్టు తాజా సంఘటనలు రుజువు చేస్తున్నాయి. మొన్నటికిమొన్న ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకుడితోపాటు విలేకరినని చెప్పుకుంటూ ప్రెస్‌ మీట్లకు హాజరయ్యే వ్యక్తి కూడా ఈ పైలట్‌ వ్యవ స్థలో భాగమై చివరకు పోలీసులకు చిక్కారు. ఇక బుధవారం మోతుగూడెం పోలీసులు స్వాధీనం చేసుకున్న రూ.2 కోట్ల విలువైన రెండు వేల కేజీల గంజాయి తరలింపు విషయంలో అదే పైలట్‌ వ్యవ స్థలో ఒప్పందం కుదుర్చుకుని సమాజంలో గౌరవ ప్రదమైన వృత్తిలో ఉన్న మరో వ్యక్తి కూడా పోలీసు లకు చిక్కాడు. చివరకు గంజాయి తరలింపు నింది తులతోపాటు తాను కూడా అరెస్టయ్యాడు. పైలట్‌గా ఒప్పందం కుదుర్చుకున్న వ్యక్తికి స్మగ్లర్లు లక్షల్లో ముట్టచెబుతున్నట్టు సమాచారం. ఏఓబీ నుంచి తెలంగాణ వైపు గంజాయి తరలించాలంటే పలు మార్గాలను స్మగ్లర్లు ఎంచుకుంటున్నప్పటికీ వయా చింతూరు మార్గం సులువుగా ఉంటుందన్న భావన స్మగ్లర్లకు ఉంది. దీంతో టన్నుల కొద్దీ గంజాయి ఈ మార్గంలో తరలిస్తూ స్మగ్లర్లు కొందరు పోలీసులకు చిక్కుతుంటే, పోలీసుల కన్నుకప్పి కూడా తెలంగా ణకు తరలిపోయిన సందర్భాలూ ఉన్నాయి. గడచిన మూడు నెలల్లో చింతూరు పోలీసులు 12 వేల కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న ఘటనను బట్టి గంజాయి ఎంత పెద్దఎత్తున తరలించే యత్నం సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. లారీలు, వ్యాన్‌లు, కార్లు, చివరకు మోటారు సైకిళ్లను కూడా స్మగ్లర్లు గంజాయి తరలింపుకు వినియోగిస్తున్నారు. తెలం గాణ, కర్నాటక, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్రలకు చెందిన స్మగ్లర్లు, వాహన చోదకులు, ఒడిసా, ఏపీలకు చెం దిన గంజాయి తరలింపు కూలీలు గడచిన మూడు నెలల కాలంలో 83 మందిని చింతూరు పోలీసులు అరెస్టు చేశారు. అదే దశలో గంజాయి తరలింపు నకు వినియోగించిన 36 వాహనాలను పోలీసులు సీజ్‌ చేయడం కూడా జరిగింది.

పైలట్లు ఏం చేస్తారంటే...

ఎక్కడైతే పోలీసు స్టేషన్లు ఉంటాయో ఆ ప్రాం తానికి చెందిన కొంతమంది అత్యాశపరులైన వ్యక్తు లను స్మగ్లర్లు ఎంచుకుంటున్నారు. అలా ఎంపిక కాబడిన వ్యక్తులు పోలీసులు, చెక్‌పోస్టులు, ఆయా చెక్‌పోస్టుల్లో చెకింగ్‌ విధానంపై ఎప్పటికప్పుడు సమాచారాన్ని స్మగ్లర్లకు చేరవేస్తుంటారు. ఆ సమా చారాన్ని అనుసరించే వాహనం ముందుకు కదులు తుంటుంది. బుధవారం మోతుగూడెం పోలీసు స్టేష న్‌ సమీపానికి ఒక ఐ20 కారు వచ్చి, ఆ వెంటనే వెనుతిరిగింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు పసిగట్టారు. వెంటనే ఆ కారులో ఉన్న వ్యక్తిని పోలీ సులు అదుపులోకి తీసుకొని ఎందుకొచ్చావు, ఎందు కు వెంటనే తిరిగి వెళుతున్నావన్న ప్రశ్నలు కురి పించి చివరకు సమాచారం రాబట్టారు. ఈ సమాచారం మేరకు మోతుగూడెం సమీపంలోని అటవీ ప్రాంతమైన సుకుమామిడి పరిసర ప్రాంతంలో ఐచర్‌ వ్యాన్‌లో రెండు వేల కేజీల గంజాయి లోడ్‌ వేసి, దానిపైన కొబ్బరికాయల లోడ్‌ వేసి తరలింపు నకు సిద్ధంగా ఉంచిన వ్యాన్‌తోపాటు, మరో ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకు న్నారు. మోతుగూడెం నుంచి వయా చింతూరు మీదుగా ఎటపాక వరకు పోలీసుల సమాచారం అందిస్తూ గంజాయి తరలింపునకు పైలట్‌గా ఒప్పందం కుదు ర్చుకున్న వ్యక్తికి స్మగ్లర్లు లక్షల్లో ముట్ట చెబుతున్నా రు. దీంతో చింతూరు ఏఎస్పీ కృష్ణకాంత్‌ చింతూరు డివిజనులోని అన్ని పోలీసు స్టేషన్ల ఎదుట చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసి 24 గంటలపాటు వాహన తనిఖీలు చేపట్టే విధంగా చర్యలు చేపట్టారు. అదే సమయంలో చిన్న రహదార్లలో కూడా పోలీసులు నిఘా పెట్టారు. మొత్తానికి ఏజెన్సీలో ప్రముఖులైన వారు సైతం పైలట్‌ వ్యవస్థలో చిక్కుకుని కటకటాల పాలవుతుండడం సంచలనం కలిగిస్తోంది.

Updated Date - 2021-10-28T06:46:26+05:30 IST