గండిపాళెం నుంచి 650 క్యూసెక్కుల నీరు విడుదల

ABN , First Publish Date - 2021-11-28T03:52:56+05:30 IST

మండలంలోని గండిపాళెం జలాశయం నుంచి శనివారం దిగువ ప్రాంతానికి 650 క్యూసెక్కులు నీరు విడుదల చేసినట్లు జలవనరుల శాఖ డీఈ రవి తెలిపారు.

గండిపాళెం నుంచి 650 క్యూసెక్కుల నీరు విడుదల
2వ క్రస్ట్‌గేట్‌ ద్వారా దిగువకు వెళుతున్న నీరు

ఉదయగిరి రూరల్‌, నవంబరు 27: మండలంలోని గండిపాళెం జలాశయం నుంచి శనివారం దిగువ ప్రాంతానికి 650 క్యూసెక్కులు నీరు విడుదల చేసినట్లు జలవనరుల శాఖ డీఈ రవి తెలిపారు. జలాశయానికి పైతట్టు ప్రాంతం నుంచి 450 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుందన్నారు. జలాశయం పూర్తి నీటిమట్టం 35 అడుగులు కాగా ప్రస్తుతం 33.8 అడుగుల నీటిమట్టం ఉందని ఆయన తెలిపారు. దీంతో ముందు జాగ్రత్తగా 2వ క్రస్ట్‌గేట్‌ ద్వారా 650 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు.


Updated Date - 2021-11-28T03:52:56+05:30 IST