‘గాంధేయవాదం ప్రపంచానికి ఆదర్శం’

ABN , First Publish Date - 2020-10-02T08:12:35+05:30 IST

గ్రామాల అభి వృద్ధే దేశాభివృద్ధి అని గాంధీజీ ఏనాడో తెలిపారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పల్లె

‘గాంధేయవాదం ప్రపంచానికి ఆదర్శం’

ఖైరతాబాద్‌/హైదరాబాద్‌సిటీ, అక్టోబర్‌ 1 (ఆంధ్రజ్యోతి): గ్రామాల అభి వృద్ధే దేశాభివృద్ధి అని గాంధీజీ ఏనాడో తెలిపారని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పల్లె ప్రగతి పేరుతో ప్రభుత్వం కూడా ఇందుకు కృషి చేస్తోందని శాసన మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి తెలిపారు. గాంధీ 150వ జయంతి సందర్భం గా గ్రామోదయ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ టెక్నాలజీ (జీకాట్‌) నిర్వహించిన వెబినార్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. స్వచ్ఛభారత్‌లో తెలంగాణ ప్రఽథమ స్థానంలో నిలిచిందన్నారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం రెండూ ఎప్పుడూ కలిసే ఉంటాయని, రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా వంటి పథకాలను ప్రారంభించిందన్నారు.


గూడేలు, తండాలను పంచాయతీలుగా మార్చి న ఘనత మనదేనన్నారు. గాంధీ ఆలోచనలను గ్రహించిన రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ మొదటిసారిగా మహాత్మా అని సంబోధించారని మాజీ జేడీ లక్ష్మీనారాయణ అన్నారు. దేశంలో మహిళలపై వేధింపులు ప్రతి ఏడాది పెరుగుతూనే ఉన్నాయని యునైటెడ్‌ నేషన్స్‌ ప్రతినిధి నిషితాసత్యం పేర్కొన్నారు. జీకాట్‌ ఉత్సవ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ బీప్రతా్‌పరెడ్డి మాట్లాడుతూ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా సమాజాన్ని నిర్మించినట్లయితే నేడు మనం ఎదుర్కొంటున్న చాలా సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. నెల్సన్‌ మండేలా, మార్టిన్‌ లూథర్‌కింగ్‌ వంటి ప్రముఖులు గాంధీ ద్వారా ప్రేరణ పొందారని జీకాట్‌ చైర్మన్‌ శ్యాంప్రసాద్‌ రెడ్డి తెలిపారు. స్వచ్ఛత, సమానత్వం, శాంతి బోధించిన గాంధీ మహాత్ముడయ్యాడని జీకాట్‌ సెక్రెటరీ పి రామ్‌రెడ్డి అన్నారు. ఇతరులను గౌరవించడం ద్వారా వారు మ నపై చేయి చేసుకున్నా వారికి అర్థమయ్యేలా చెప్పడం శాంతి మంత్రమని జీకాట్‌ ఫౌండర్‌ ఢిల్లీ వసంత్‌ తెలిపారు. కార్యక్రమంలో జీ కాట్‌ సీఈఓ శ్రవణ్‌, ప్రకాష్‌ తదితరులు పాల్గొన్నారు.      

Updated Date - 2020-10-02T08:12:35+05:30 IST