విద్యార్థులు పరీక్షలంటే భయాన్ని వీడాలి : గంపా నాగేశ్వర రావు

ABN , First Publish Date - 2020-03-03T11:15:59+05:30 IST

విద్యార్థులు వార్షిక పరీక్షలంటే భయాన్ని వీడనాడాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు గంప నాగేశ్వర్‌రావు

విద్యార్థులు పరీక్షలంటే భయాన్ని వీడాలి : గంపా నాగేశ్వర రావు

గజ్వేల్‌, మార్చి 2: విద్యార్థులు వార్షిక పరీక్షలంటే భయాన్ని వీడనాడాలని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణుడు గంప నాగేశ్వర్‌రావు అన్నారు. గజ్వేల్‌ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో సోమవారం జడ్పీటీసీ పంగ మల్లేశం ఆధ్వర్యంలో పదో తరగతి విద్యార్థులకు ఇంపాక్ట్‌ క్లాసులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒత్తిడిని జయిస్తే పరీక్షల్లో రాణించవచ్చని అన్నారు. ఇందుకోసం జాగింగ్‌, స్కిప్పింగ్‌, ప్రాణాయామం చేయాలన్నారు.


ప్రణాళికబద్దంగా చదివితే లక్ష్యం చేరువ అవుతుందన్నారు. వెలుతురు ఎక్కువగా ఉన్న ప్రాంతంలో చదవాలని చెప్పారు. అనంతరం జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మ, టీఎ్‌సఎ్‌ఫఢీసీ చైర్మన్‌ వంటేరు ప్రతా్‌పరెడి మాట్లాడుతూ పదో తరగతి ఫలితాల్లో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం ఖాయమన్నారు.


అనంతరం విద్యార్థులకు వీపీజే ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో పరీక్షా ప్యాడ్‌లు, పెన్నులు, స్టేషనరీ, స్నాక్స్‌ని వీపీజే ఫౌండేషన్‌ చైర్మన్‌ విష్ణుజగతి, ఎస్‌ఎం ఫౌండేషన్‌ వ్యవస్థాపకులు మనోజ్‌కుమార్‌, రోటరీ క్లబ్‌ ఆఫ్‌ గజ్వేల్‌ సెంట్రల్‌ అధ్యక్షులు పోరెడ్డి మల్లేశం, సత్యనారాయణ, కుమార్‌, బ్రహ్మం అందజేశారు. కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్‌ చెర్మన్‌ పన్యాల భూపతిరెడ్డి, హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మెన్‌ మడుపు భూంరెడ్డి, జిల్లా పరిషత్‌ మాజీ చైర్మన్‌ లక్ష్మీకాంతారావు, సీనియర్‌ నాయకులు డాక్టర్‌ యాదవరెడ్డి, గడా ప్రత్యేకాధికారి ముత్యంరెడ్డి, గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మునిసిపల్‌ చైర్మన్‌ నేతి చిన్న రాజమౌళి, వైస్‌చైర్మన్‌ జకీయోద్దీన్‌, ఎంపీపీ దాసరి అమరావతి, సుధాకర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ కృష్ణాగౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మధు, నాయకులు విరాసత్‌ అలీ, రాజు, కిరణ్‌కుమార్‌రెడ్డి, స్వామిచారి, హన్మంత్‌రెడ్డి, తోట శ్రీనివాస్‌, ప్రవీణ్‌కుమార్‌, కన్నా సంగెపు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2020-03-03T11:15:59+05:30 IST