11 నుంచి మున్సిపల్‌ కార్మికుల నిరవధిక సమ్మె

ABN , First Publish Date - 2022-07-03T05:35:51+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈనెల 11 నుంచి మున్సిపల్‌ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నట్లు ఎఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సురేష్‌ బాబు, సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి యస్‌ఏ గౌస్‌ తెలిపారు.

11 నుంచి మున్సిపల్‌ కార్మికుల నిరవధిక సమ్మె
మున్సిపల్‌ కమిషనర్‌కు సమ్మె నోటీసు అందజేస్తున్న ఏఐటీయూసీ, సీఐటీయూ నాయులు, కార్మికులు

కందుకూరు, జూలై 2: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలు నిరసిస్తూ ఈనెల 11 నుంచి మున్సిపల్‌ కార్మికులు నిరవధిక సమ్మె చేస్తున్నట్లు ఎఐటీయూసీ  జిల్లా ప్రధాన కార్యదర్శి బి.సురేష్‌ బాబు, సీఐటీయూ డివిజన్‌ కార్యదర్శి యస్‌ఏ గౌస్‌ తెలిపారు. స్థానిక పారిశుధ్య కార్మికులు ఆయా సంఘాల ఆధ్వర్యాన శనివారం మున్సిపల్‌ కమిషనర్‌కు మనోహర్‌కు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ మున్సిపాలిటీ పారిశుధ్య కార్మికులకు కనీస వేతనచట్టం పరిధికి లోబడి వేతనాలు ఇవ్వాలని, ఇంజనీరింగ్‌ విభాగంలో పనిచేస్తున్న కార్మికులకు వారి నైపుణ్యాన్ని బట్టి వేతనాలు పెంచాలని కోరారు.  సమస్యల పరిష్కారం కోసం శాంతియుతంగా ఎన్నిసార్లు ఆందోళనలు చేసినా ఫలితం లేకపోవటంతో 11 నుంచి నిరవధిక సమ్మెకు పూనుకుంటున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో  నాయకులు పి. బాలకోటయ్య, వై. ఆనంద్‌మోహన్‌, రమణమ్మ, నాగేశ్వరరావు, శేషమ్మ  పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-03T05:35:51+05:30 IST