ఆనందోత్సాహాలతో స్నేహితుల దినోత్సవం

ABN , First Publish Date - 2021-08-02T05:08:24+05:30 IST

బుచ్చి పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో స్నేహితుల దినోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించారు.

ఆనందోత్సాహాలతో స్నేహితుల దినోత్సవం
చెల్లాయపాళెంలో సర్పంచ్‌ ఆఽధ్వర్యంలో మొక్కలు నాటిన అంబేద్కర్‌ యూత్‌ సభ్యులు

బుచ్చిరెడ్డిపాళెం, ఆగస్టు 1: బుచ్చి పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో స్నేహితుల దినోత్సవం ఆనందోత్సాహాల నడుమ ఘనంగా నిర్వహించారు. పలువురు స్నేహితులు ఫోన్ల ద్వారా వాట్సాప్‌లకు ఫ్రెండ్‌షిప్‌ డే శుభాకాంక్షలు తెలుపుకున్నారు.  ఈ సందర్భంగా పచ్చదనం, పర్యావరణం కోసం మండలంలోని మినగల్లు గ్రామ సర్పంచ్‌ బొర్రు పూజిత ఆధ్వర్యంలో మినగల్లు సేవాసమితి వ్యవస్థాపకుడు రాము, సభ్యులు, రావూరి రజనీకాంత్‌ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ యూత్‌ సభ్యులు, సర్పంచ్‌ అభిమానులు రోడ్ల పక్కన మొక్కలు నాటారు.  

  

పార్లపల్లిలో స్నేహితుల దినోత్సవం

విడవలూరు, అగస్టు 1: స్నేహితుల దినోత్సవ వేడుకలను మండలంలోని పార్లపల్లి గ్రామంలో ఆదివారం ఘనంగా జరిగాయి. తెలుగు యువత ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకల్లో  సర్పంచ్‌ రామిశెట్టి స్వాతి, టీడీపీ నాయకుడు రామిశెట్టి వెంకటేశ్వర్లు పాల్గొని కేక్‌ కట్‌చేసి యువతతో కలసి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవితంలో అన్నివిధాలుగా అండదండలుగా నిలిచేది స్నేహమేనని తెలిపారు. ఎన్నికల్లో టీడీపీ గెలుపునకు స్నేహితులే కారణమన్నారు. కార్యక్రమంలో తెలుగు యువత సభ్యులు ఆశోక్‌, శ్రీకాంత్‌, జయచంద్ర, కార్తీక్‌, ప్రసాద్‌, రవీంద్ర, సురేష్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2021-08-02T05:08:24+05:30 IST