Fresh Water: గాలిలోని తేమనుంచి నీరు

ABN , First Publish Date - 2022-07-27T13:49:04+05:30 IST

గాలిలోని తేమ నుంచి మంచినీటిని ఉత్పత్తి చేసే యంత్రాన్ని(the machine) మైలాపూర్‌ కపాలీశ్వరాలయంలో ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం రాష్ట్ర దేవాదాయ శాఖ

Fresh Water: గాలిలోని తేమనుంచి నీరు

- మైలాపూరు కపాలీశ్వరాలయంలో యంత్రం ఏర్పాటు

- ప్రారంభించిన మంత్రి శేఖర్‌బాబు


చెన్నై, జూలై 26 (ఆంధ్రజ్యోతి): గాలిలోని తేమ నుంచి మంచినీటిని ఉత్పత్తి చేసే యంత్రాన్ని(the machine) మైలాపూర్‌ కపాలీశ్వరాలయంలో ఏర్పాటు చేశారు. మంగళవారం ఉదయం రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి పీకే శేఖర్‌బాబు(Minister PK Shekhar Babu) రూ.18లక్షల విలువైన యంత్రపరికరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తమ శాఖ ఉన్నతస్థాయి సలహామండలి సభ్యులైన మల్లిఖార్జునన్‌, సంతాన కృష్ణన్‌ సంయుక్తంగా గాలిలోని తేమతో మంచినీటిని ఉత్పత్తి చేసే పరికరాన్ని ఏర్పాటు చేయడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు. ఈ పరికరం ద్వారా ఆలయానికి వచ్చే భక్తులకు పరిశుభ్రమైన మంచినీరు(fresh water) లభిస్తుందన్నారు. ఈ పరికరం గాలిలోని తేమను స్వీకరించి పరిశుభ్రమైన నీటిని అందిస్తుందన్నారు. ఈ యంత్రం రోజుకు 500 లీటర్ల వరకు మంచినీటిని అందించగలదని తెలిపారు. ప్యారీస్‌ కార్నర్‌లో ఉన్న కాళికాంబాళ్‌ ఆలయంలో కూడా ఇలాంటి యంత్రాన్ని ఏర్పాటు చేస్తామని మల్లిఖార్జునన్‌(Mallikarjunan) హామీ ఇచ్చారని మంత్రి శేఖర్‌బాబు చెప్పారు. రెండు ఆలయాల్లో ఈ యంత్రం పనితీరు పరిశీలించిన తరువాత దేవాదాయ శాఖ ఆధ్వర్యంలోని సుప్రసిద్ధ ఆలయాల్లో ఈ పరికరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఇక చిదంబరం ఆలయంలోని నగలను లెక్కించేందుకు ఆగస్టు రెండో వారంలో ఓ తేదీ ప్రకటిస్తామని, ఆ రోజు దేవాదాయ శాఖ అధికారులు వచ్చి వాటిని పరిశీలించవచ్చునని దీక్షితార్లు తెలియజేశారని మంత్రి చెప్పారు. 

Updated Date - 2022-07-27T13:49:04+05:30 IST