మహనీయుల ప్రాణత్యాగాల ఫలితమే స్వేచ్ఛా స్వాతంత్య్రం

ABN , First Publish Date - 2022-08-16T05:51:12+05:30 IST

మహనీయులు తమ ప్రాణత్యాగల ఫలితమే మన స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలని ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రి డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు.

మహనీయుల ప్రాణత్యాగాల ఫలితమే స్వేచ్ఛా స్వాతంత్య్రం
వనపర్తి : జాతీయ జెండాకు వందనం చేస్తున్న చిన్నారెడ్డి, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు

- ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రి చిన్నారెడ్డి

- రెపరెపలాడిన మువ్వన్నెల జాతీయ జెండా

- కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా  స్వాతంత్య్ర వేడుకలు

వనపర్తి టౌన్‌/ రాజీవ్‌చౌరస్తా/ అర్బన్‌/ రూరల్‌, ఆగస్టు 15: మహనీయులు తమ ప్రాణత్యాగల ఫలితమే మన స్వేచ్ఛా, స్వాతంత్ర్యాలని ఏఐసీసీ కార్యదర్శి మాజీ మంత్రి డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం వద్ద 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి కాంగ్రెస్‌ పార్టీ నాయకు లు, కార్యకర్తలతో కలిసి రాజీవ్‌ చౌరస్తా వరకు ర్యాలీ గా వెళ్లారు. రాజీవ్‌గాంధీ విగ్రహానికి నివాళి అర్పిం చారు. అనంతరం ఇందిర పార్కు వద్దకు వెళ్లి ఇంది రా గాంధీ విగ్రహానికి నివాళి అర్పించారు. ఈ సం దర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగాలను కొనియా డారు. మునిసిపల్‌ కార్యాలయంలో మునిసిపల్‌ చైర్మ న్‌ గట్టు యాదవ్‌ మహనీయుల చిత్రపటాలకు ఘ నంగా నివాళి అర్పించి జాతీయ జెండాను ఎగుర వేశారు.  జిల్లా పోలీస్‌ కార్యాలయంలో అదనపు ఎస్పీ షాకీర్‌ హుస్సేన్‌ పోలీసుల గౌరవ వందనం స్వీకరించి స్వాతంత్య్ర సమరయోధులను స్మరించు కుంటూ జాతీయ పతాకాన్ని ఎగరవేశారు.  వనపర్తి జిల్లా కేంద్రంలోని న్యాయస్థానాల సముదాయంలో సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వ హించారు. కలెక్టరేట్‌ కార్యాలయాల సముదాయ భ వనం ఆవరణంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. దేశభక్తి గేయాలకు చిన్నారులు ప్రదర్శించిన నృత్యాలు అల రించాయి. వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఏర్పా టు చేసిన స్టాల్స్‌ను మంత్రి సందర్శించారు. అదే విధంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించిన మంత్రి నిరంజన్‌రెడ్డి, జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, కలెక్టర్‌ షేక్‌ యాస్మిన్‌ బాషా, అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌, లోకల్‌ బాడీ కలెక్టర్‌ ఆశిష్‌ సంగ్వాన్‌, అదనపు ఎస్పీ షాకీర్‌ హుస్సేన్‌ చిన్నారుల ను అభినందించారు.  

బీజేపీ, టీడీపీ, సీపీఎం  ఆధ్వర్యంలో..

75వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను సోమ వారం బీజేపీ కార్యాలయంలో 75వ స్వాతంత్య్ర దినో త్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.  జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్‌రెడ్డి పార్టీ కార్యాలయంపై జాతీయ జెండా ఎగురవేశారు. తెలుగుదేశం పార్టీ  కార్యాలయ ఆవరణంలో నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ టీడీపీ అధ్యక్షుడు బొలమోని రాములు జాతీయ జెండాను ఎగురవేసి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్ష లు తెలిపారు. సీపీఎం నాయకులు ఆపార్టీ కార్యాల యం ముందు జాతీయ జెండాను ఎగురవేశారు.  కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ లోక్‌నాథ్‌రెడ్డి, మాజీ మునిసిపల్‌ చైర్మన్‌లు బొలమోని లక్ష్మయ్య, రమేష్‌ గౌడ్‌, వైస్‌ చైర్మన్‌ వాకిటి శ్రీధర్‌, కౌన్సిలర్లు, కమిష నర్‌ విక్రమసింహరెడ్డి, మేనేజర్‌ ఖాజా, ఏఈ భాస్క ర్‌, శానిటరీ ఇన్సూపెక్టర్‌ రమేష్‌ పాల్గొన్నారు. 

పాన్‌గల్‌లో..

పాన్‌గల్‌ :  స్వాతంత్య్రం  దినోత్సవ వేడుకలను సోమవారం మండలంలో ఘనంగా జరుపుకున్నారు. మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ నాగన్న, పంచాయతీ కార్యాలయంలో సర్పంచు గోపాల్‌రెడ్డి, ఎంఆర్‌సీ భవనంలో ఎంఈవో లక్ష్మణ్‌నాయక్‌, సింగిల్‌విండో కార్యాలయంలో చైర్మన్‌  విష్ణువర్ధన్‌రెడ్డి, పీహెచ్‌సీలో డాక్టర్‌ రాజశేఖర్‌, మం డల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ   శ్రీధర్‌రెడ్డి, తహసిల్దార్‌ కార్యాలయంలో తహసీల్దార్‌ యేసయ్య, ఆయా పార్టీ కార్యాలయాల వద్ద పార్టీ నాయకులు జాతీయ జెండాలను ఎగురవేశారు. కార్యక్రమంలో సర్పంచులు, ఎంపీటీసీలు అధికారులు, ప్రజాప్రతి నిధులు గ్రామస్థులు పాల్గొన్నారు.

పెబ్బేరులో...

పెబ్బేరు : 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు సోమవారం మండలంఓ ఘనంగా జరుపుకొన్నారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగరవేసి సంబురాలు  చేసుకున్నారు. యువకులు జాతీయ జెండాలతో బైక్‌ర్యాలీ నిర్వహిం చారు.  విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణ లతో కనువిందు చేశారు. తహిసీల్దార్‌ కార్యాలయం పై ఇన్‌చార్జి తహిసీల్దార్‌ జయసింహ, ఎంపీడీవో కార్యాలయంపై ఎంపీపీ శైలజ, మునిసిపల్‌ కార్యాల యంపై చైర్‌పర్సన్‌ కరుణశ్రీ,   సింగిల్‌విండో కార్యాల యంపై చైర్మన్‌ కోదండరాంరెడ్డి, ప్రభుత్వ ఆసుప త్రిపై డాక్టర్‌ సాయిశ్రీ, ఎంవీఐ కార్యాలయం వద్ద అవినాష్‌ జెండాలను ఎగురవేశారు.  

వీపనగండ్లలో..

వీపనగండ్ల : మండల కేంద్రంతో పాటు మండ లంలోని అన్ని గ్రామాల్లో ప్రభుత్వ, ప్రైవేటు కార్యాల యాలు, పాఠశాలల వద్ద సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకొన్నారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ఎమ్మార్వో పాండునాయక్‌, ఎంపీడీ వో కార్యాలయంలో ఎంపీపీ కమలేశ్వర్‌రావు, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ రమణగౌడ్‌, వ్యవసాయ కార్యాల యంలో ఏవో డాకేశ్వర్‌గౌడ్‌, ఆరోగ్య కేంద్రంలో డాక్టర్‌ వంశీ,  పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచు నర్సింహ్మరెడ్డి  జాతీయ పతకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మిఠాయిలు పంపిణీ చేశారు.   

చిన్నంబావిలో..

చిన్నంబావి : మండల కేంద్రంతో పాటు  మండ లంలోని అన్ని గ్రామ పంచాయతీలలో సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వ హించారు. తహసీల్దార్‌ కార్యాలయంలో ఘన్సీరాం నాయక్‌, ఎంపీడీవో కార్యాలయంలో ఎంపీపీ సోమేశ్వరమ్మ, పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐ వస్త్రం నాయక్‌,  సింగిల్‌విండో కార్యాలయంలో చైర్మన్‌ నరసింహారెడ్డి, కస్తూర్బా గాంధీ పాఠశాలలో ప్రిన్సిపా ల్‌ రమాదేవి, వ్యవసాయ కార్యాలయంలో యుగంధ ర్‌, పశువైద్యశాలలో డాక్టర్‌ స్వాతి, గ్రామ పంచాయ తీ కార్యాలయాల వద్ద సర్పంచులు జాతీయ జెండాను ఎగురవేశారు.  

కొత్తకోటలో...

కొత్తకోట : మండలంలో 75వ స్వాతంత్య్ర వజ్రో త్సవ సంబురాలు అంబురాన్ని అంటాయి. పాఠశాల విద్యార్థులు జాతీయ జెండాలతో వీధుల్లో ర్యాలీ నిర్వ హిస్తూ స్వాతంత్య్ర సమరయోధులను స్మరించుకు న్నారు. పట్టణంలోని గాంధీ విగ్రహం, మునిసిపల్‌ కార్యాలయం వద్ద చైర్‌పర్సన్‌ సుకేశిని, సింగిల్‌విండో కార్యాలయం వద్ద చైర్మనులు వంశీధర్‌రెడ్డి, వాసు దేవారెడ్డి, మండల ప్రజాపరిషత్‌, తహసీల్దార్‌ కార్యా లయాల వద్ద ఎంపీపీ గుంత మౌనిక, తహసీల్దార్‌ బాల్‌రెడ్డి జాతీయ జెండాను ఎగురవేశారు.  

మదనాపురంలో..

మదనాపురం : దేశ స్వాతంత్య్ర దినోత్సవ వేడుక లను సోమవారం మండలంలో ఘనంగా నిర్వహిం చారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో జాతీయ జెం డాలను ఎగురవేశారు. పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌, తహ సీల్దార్‌ కార్యాలయంలో ఎమ్మార్వో, మండల పరిషత్‌ కార్యాలయంలో ఎంపీపీ, వ్యవసాయ మార్కెట్‌ కా ర్యాలయంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌, గ్రామ పంచా యతీలో ఆయా గ్రామాల సర్పంచులు జెండాలను ఎగురవేశారు. విద్యార్థులు జాతీయ నాయకుల వేషధారణలో పురవీధులలో ర్యాలీ  నిర్వహించారు.  

అమరచింతలో...

అమరచింత : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను సోమవారం  మండల ప్రజలు ఘనంగా జరుపుకు న్నారు. మండల రెవెన్యూ కార్యాలయం ముందు తహసీల్దార్‌ సింధూజ జాతీయ జెండాను ఎగుర వేశారు. మునిసిపాలిటీ కార్యాలయంలో చైర్‌పర్సన్‌ బీ మంగమ్మ త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు 

ఆత్మకూరులో.. 

ఆత్మకూర్‌: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఆత్మ కూర్‌ మండలంలో సోమవారం ఘనంగా నిర్వహిం చారు. ఈ సందర్భంగా మండలంలోని ఆయా గ్రా మాలలో సర్పంచులు గ్రామ పంచాయతీల వద్ద జాతీయ జెండాలను ఎగురవేసి దేశభక్తిని చాటుకు న్నారు.  మునిసిపల్‌ కార్యాలయం, మండల పరిష త్‌, తహసీల్దార్‌,  ఎంపీపీ, మార్కెట్‌ యార్డు పోలీస్‌ స్టేషన్‌ ప్రభుత్వ ఆసుపత్రి కార్యాలయాల్లో సంబంధి త అధికారులు జాతీయ జెండాను ఎగురవేసి దేశ భక్తిని చాటుకున్నారు. బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్‌, వివేకానంద స్వామి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.  

పెద్దమందడిలో.. 

పెద్దమందడి :  మండల వ్యాప్తంగా సోమవారం స్వాతంత్య్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. మం డల పరిషత్‌ కార్యాలయంపై ఎంపీపీ మేఘారెడ్డి, తహసీల్దార్‌ కార్యాలయంపై ఎమ్మార్వో సంధ్య, సింగి ల్‌విండో కార్యాలయంపై చైర్మన్‌ విష్ణువర్ధ్దన్‌రెడ్డి, ఆయా ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, గ్రామ పంచాయతీ భవనాల, పాఠశాలలపె త్రివర్ణ పతాకా న్ని ఎగురవేశారు. విద్యార్థి దశ నుంచే పిల్లల్లో దేశ భక్తి, స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలపై అవగా హన కల్పించారు. స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్క రించుకొని పెద్దమందడి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో నిర్వహిం చిన వేడుకల్లో విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతి కార్యక్రమాలు అందరిని అలరించాయి.

శ్రీరంగాపూర్‌లో..  

పెబ్బేరు రూరల్‌/ శ్రీరంగాపురం : మండలాల్లో 75వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తహసీల్దార్‌ కార్యాలయం వద్ద ఎమ్మార్వో అబ్రహాం, మండల పరిషత్‌ కార్యాలయం వద ఎంపీపీ గాయత్రి, పోలీస్‌ స్టేషన్‌ వద్ద ఎస్‌ఐ మల్లేష్‌, గ్రామ పంచాయతీ వద్ద సర్పంచ్‌ వినీల రాణి, సింగిల్‌విండో కార్యాలయం వద్ద అధ్యక్షుడు జగన్నా థం నాయుడు, ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాల్‌ అరుణ్‌ కుమార్‌, జడ్పీహెచ్‌ఎస్‌ హెచ్‌ఎం కురుమ య్య, వివిధ సంఘాలు, పార్టీల కార్యాలయాల వద్ద   జాతీయ జెండాను ఆవిష్కరించారు. 

 





Updated Date - 2022-08-16T05:51:12+05:30 IST