స్వాతంత్య్ర సమరయోధులు, జవాన్లను సన్మానించాలి

ABN , First Publish Date - 2021-08-15T06:37:12+05:30 IST

పంద్రాగస్టు సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు, జవాన్లను సన్మానించి మన ల్ని మనం గౌరవించుకోవాలని కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ అన్నారు.

స్వాతంత్య్ర సమరయోధులు, జవాన్లను సన్మానించాలి
సన్మానిస్తున్న జిల్లా కాంగ్రెస్‌ నాయకులు

సిరిసిల్ల టౌన్‌, ఆగస్టు 14: పంద్రాగస్టు సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులు, జవాన్లను సన్మానించి మన ల్ని మనం గౌరవించుకోవాలని  కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ అన్నారు. ఏఐసీసీ, టీపీసీసీ పిలు పుతో 75వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా కాం గ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ ఆధ్వర్యంలో శనివారం సిరిసిల్ల పట్టణంలోని  పార్టీ కార్యాలయంలో స్వాతంత్య్ర సేనాని, షాహిద్‌ సన్మాన్‌ దివాస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.జిల్లాకు చెందిన స్వాతంత్య్ర సమర యోధులు వంగరి నర్సయ్య, వృద్ధాప్యంతో మరణించిన స్వాతంత్య్ర సమరయోధులు గుడ్ల లక్ష్మీనర్సయ్య, పరాం కుశం రాములు, కోరోల్ల నర్సయ్య, మ డుపు రాజురెడ్డి  కుటుంబ సభ్యులు గుడ్ల రవి, పరాం కుశం విజయలక్ష్మి, కోరోల్ల భాస్కర్‌, మడుపు సత్యబాయి, జవాన్లు కే సుభాష్‌, తుంగ పవన్‌, బండ రాజు, పాటి దేవయ్యను సన్మానిం చారు. ఈ సందర్భంగా  పార్టీ జిల్లా అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, టీపీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్‌ మాట్లాడారు. స్వాతంత్య్రం కోసం పోరాడిన స్వాతంత్య్ర సమరయోధులను, ప్రజల రక్షణ కోసం దేశం బార్డర్లలో కాపలాకాస్తున్న జవాన్ల సేవలను మననం చేసుకోవా లన్నారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి లింగాల భూపతి, ఉపాధ్యక్షుడు ప్రకాష్‌, పట్టణ కాంగ్రెస్‌ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు  శ్రీదేవి, బ్లాక్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు దేవరాజు, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు  బాలరాజు, తంగళ్లపల్లి మండల అధ్యక్షుడు  ప్రవీణ్‌, కౌన్సిలర్‌ లలితాప్రకాష్‌, సర్పంచ్‌ ప్రదీప్‌, నాయకులు కాసర్ల రాజు, మునిగల రాజు, గడ్డం మల్లేష్‌గౌడ్‌,  సీహెచ్‌ శ్రీనివాస్‌, మల్లేశం పాల్గొన్నారు.

Updated Date - 2021-08-15T06:37:12+05:30 IST