రేపు ఉచిత కంటి పరీక్షలు

ABN , First Publish Date - 2022-08-12T03:34:15+05:30 IST

టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రేపు ఉచిత కంటి పరీక్షలు, అద్దాల పంపిణీ జరుగుతుందని డాక్టర్‌ ఉగ్ర కార్యాలయ వర్గాలు గురువారం ప్రకటనలో తెలిపాయి.

రేపు ఉచిత కంటి పరీక్షలు

కనిగిరి, ఆగస్టు 11 :  టీడీపీ ఇన్‌చార్జి డాక్టర్‌ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో రేపు ఉచిత కంటి పరీక్షలు, అద్దాల పంపిణీ జరుగుతుందని డాక్టర్‌ ఉగ్ర కార్యాలయ వర్గాలు గురువారం ప్రకటనలో తెలిపాయి. జూన్‌ 12వ తేదీన ఉగ్ర ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి సహకారంతో మెగా కంటి వైద్య శిబిరం నిర్వహించారు. అందులో 830 మందికి కంటి ఆపరేషన్లు నిర్వహించారు. ఆపరేషన్లు చేయించుకున్న వారికి శంకర కంటి ఆసుపత్రి వైద్యులు కళ్లద్దాలను పంపిణీ చేస్తారని తెలిపారు. స్థానిక అమరావతి గ్రౌండ్స్‌లో ఈనెల 13న ఉదయం 10గంటల నుంచి వైద్య పరీక్షలు నిర్వహిస్తారని, ఆపరేషన్‌ చేయించుకున్న వారందరూ హాజరు కావాలని కోరారు.   


Updated Date - 2022-08-12T03:34:15+05:30 IST