దర్జాగా మట్టి దందా!

ABN , First Publish Date - 2020-12-05T05:41:28+05:30 IST

ఆ గ్రామం... ఎర్రమట్టి దందాకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది...

దర్జాగా మట్టి దందా!
ఉప్పరిపల్లి పరిధిలో అక్రమార్కులు నిల్వ చేసిన ఎర్రమట్టి కుప్పలు

  • రహస్య స్థావరాల్లో ఎర్రమట్టి కుప్పలు 
  • రాత్రిపూట రవాణా చేస్తున్న అక్రమార్కులు
  • ఉప్పర్‌పల్లిలో ఏళ్ల తరబడి జోరుగా సాగుతున్న అక్రమ తంతు
  • చోద్యం చూస్తున్న అధికారులు 
  • మైనింగ్‌ శాఖ ఆదాయానికి గండి


శామీర్‌పేట : ఆ గ్రామం... ఎర్రమట్టి దందాకు కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది... ఆ గ్రామపరిధిలో ఎక్కడ చూసినా ఎర్రమట్టి కుప్పలు తెప్ప లుగా దర్శనమిస్తాయి.. ఆ గ్రామానికి చెందినవారు కొందరు అక్ర మార్కులు మాఫియా ముఠాగా ఏర్పడి దర్జాగా, నిర్భయంగా ఎర్ర మట్టిని అక్రమ రవాణా చేస్తూ కోట్లాది రూపాయలు దండుకుంటున్నారు. అధి కారుల అండదండలతో ఈ ఎర్రమట్టి అక్రమ దందా ఉప్పర్‌పల్లి పరిధిలో ఏళ్ళతరబడి దర్జాగా మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. ఈ అక్రమ తంతు వివరాలిలా ఉన్నాయి. 

శామీర్‌పేట మండలం ఉప్పరిపల్లి ప్రాంతంలో ఎర్రమట్టి దందాను అక్ర మార్కులు యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. మండలంలోని వివిధ ప్రాం తాల నుంచి తీసుకొచ్చి ఇక్కడ డంప్‌ చేసి అక్రమార్జనకు పాల్పడుతు న్నారు. ఎవరికైనా ఎర్రమట్టి కావాలంటే ఇక్కడ తప్పకుండా దొరుకుతుం దనే విషయం మండలంలోని చిన్నపిల్లాడిని అడిగినా ఇట్టే చెప్పేస్తాడు. అంటే ఇక్కడ ఏ స్థాయిలో ఎర్రమట్టి అక్రమ వ్యాపారం జరుగుతుందో అర్ధం చేసుకోవచ్చు. ఎర్రమట్టి దందా జరుగుతుందని అధికారులకు తెలిసినా కనీసం అటువైపు కన్నెత్తి చూడకపోవడంలో ఆంతర్యం ఏమిటోనని పలువురు ప్రశ్నిస్తున్నారు. తాయిలాల మత్తులో అధికారులు తూగుతూ ఇటువైపు వెళ్లడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. 


దర్జాగా ఎర్రమట్టి మాఫియా

శామీర్‌పేట మండలం, తూంకుంట, మున్సిపల్‌ పరిధిలోని ఉప్పర్‌పల్లి గ్రామ పరిధిలో ఎక్కడ చూసినా ఎర్రమట్టి మాఫియా ముఠాలే కనిపిస్తు న్నాయి. పదేళ్ల క్రితం ముగ్గురు వ్యాపారులు ఆ గ్రామానికి చెందిన వారు ఎర్రమట్టి, మొరంమట్టి అక్రమ దందా చేసేవారు. ఇందులో లాభాలు అధికంగా ఉంటాయని తెలుసుకున్న గ్రామానికి చెందిన వారు క్రమేణా పది మంది వ్యాపారులు ఆ దందాలో దిగి పెద్ద మాఫియా ముఠాగా తయారై నిర్భ యంగా, దర్జాగా ఎర్ర మట్టి, మొరంమట్టిని రవాణా చేస్తున్నారు.


పెద్దపెద్ద కుప్పలుగా ఎర్రమట్టి 

ఉప్పర్‌పల్లి పరిధిలో చుట్టూ ఎక్కడ చూసినా పెద్దపెద్ద ఎర్రమట్టి కుప్పలు దర్శనమిస్తు న్నాయి. అక్రమార్కులు ఉద్దెమర్రి, ఆద్రాస్‌పల్లి, కేశ్వాపూర్‌, నర్సంపల్లి గ్రామాల శివారు ప్రాంతాల నుంచి ఎర్రమట్టిని జేసీబీల సాయంతో తోడి టిప్పర్ల ద్వారా తీసుకొచ్చి ఉప్పర్‌పల్లి పరిధి లోని రహస్య స్థావరాల్లో నిల్వ చేస్తున్నారు. అవసరమైన వారికి రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ తరహా దందా పదేళ్లుగా సాగుతోంది. అయినా సంబంధిత అధికారులు వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్నారని స్థానికులు విమర్శిస్తున్నారు.


మైనింగ్‌ శాఖ ఆదాయానికి గండి

కాగా, ఎవరైనా వ్యాపారులు మట్టిని రవాణా చేయాలంటే ముందుగా రెవెన్యూ శాఖను సంప్రదించి సంబంధిత మైనింగ్‌ శాఖకు ఫీజు చెల్లించి అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది. మైనింగ్‌శాఖ నుంచి అనుమతులు తీసుకున్న తర్వాతే వ్యాపారులు మట్టిని రవాణా చేయాలి. కానీ అలాంటి ప్రభుత్వ నిబంధనలను ఇక్కడి మట్టి వ్యాపారులెవరు పాటించకుండా తుంగలో తొక్కుతూ మట్టిని రవాణా చేస్తున్నారు. దీంతో మైనింగ్‌ శాఖ ఆదాయానికి ఏటా కోట్లాది రూపాయలు గండి కొడుతున్నారు.


లంచాలకు మరిగిన అధికారులు

ఉప్పర్‌పల్లి, శామీర్‌పేట, మూడు చింతలపల్లి మండలాల్లోని పలు ప్రాం తాలకు చెందిన ఎర్రమట్టి, మొరంమట్టి మాఫియా ముఠాలతో సంబంధిత రెవె న్యూ, మైనింగ్‌ శాఖల అధికారులు నెలనెలా మామూళ్లకు మరిగినందువల్లే ఏళ్లతరబడి మట్టి దందా యథేచ్ఛగా సాగుతుందని మండల ప్రజలు ఆరోపిస్తున్నారు. పదేళ్లుగా మట్టి దందాలను చేస్తుంటే సంబంధిత అధికారులు ఏంచేస్తు న్నారని, ఆ ముఠాపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నిస్తున్నారు.


తరచూ దాడులు చేస్తేనే అడ్డుకట్ట

ఉప్పర్‌పల్లి, శామీర్‌పేట, మూడుచింతలపల్లి మండలాల్లోని పలు ప్రాంతాల్లో సంబంధిత రెవెన్యూ, మైనింగ్‌ శాఖకు చెందిన అధికారులు తరచుగా ఆకస్మిక దాడులు చేసి పట్టుకుని కఠిన క్రిమినల్‌ చర్యలు తీసుకుంటేనే ఎర్రమట్టి అక్రమ దందా మాఫియాకు అడ్డుకట్ట పడుతుం దని, నివారణ జరుగుతుందని మండల ప్రజలు అభిప్రాయపడుతున్నారు.


మట్టి దొంగలను కఠినంగా శిక్షించాలి

శామీర్‌పేట, మూడుచింతలపల్లి మండలాల్లో ఏళ్ళ తరబడి ఎర్రమట్టిని, మొరం మట్టిని అక్రమంగా రవాణా చేస్తున్నారు. మైనింగ్‌ శాఖ నుంచి అనుమతులు లేకుండా ప్రభుత్వ, ప్రైవేటు స్థలాల్లోంచి నిత్యం 50 నుంచి 100 ట్రిప్పుల మట్టిని దర్జాగా తరలిస్తున్నారు. సాయంత్రం 6 నుంచి ఉదయం 6 గంటల వరకు  ఈ అక్రమ తంతు ఎక్కువ జరుగుతుంది. సంబంధిత రెవెన్యూ అధికారులు అక్రమార్కులతో కుమ్మక్కయ్యారు. ఈ విషయమై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. 

- వంగరి హృదయ్‌కుమార్‌, మాజీ వైస్‌ ఎంపీపీ, శామీర్‌పేట మండలం


విచారణ జరిపి అక్రమార్కులపై క్రిమినల్‌ కేసులు

శామీర్‌పేట, మూడుచింతలపల్లి మండ లాల్లో జరుగుతున్న మట్టి అక్రమ రవా ణాపై తక్షణమే విచారణ జరిపి అక్రమా ర్కులపై క్రిమినల్‌ కేసులు పెడతాం. మైనింగ్‌ శాఖతో ఎలాంటి అనుమతులు లేకుండా ఎర్రమట్టి, మొరంమట్టిని అక్ర మంగా రవాణా చేస్తే సహించేది లేదు. మట్టి దొంగలు ఎవరైన, ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు, వారిపై పిడి యాక్టు కింద క్రిమినల్‌ చర్యలను తీసుకుంటాం. 

- సురేందర్‌, శామీర్‌పేట తహసీల్దార్‌


Updated Date - 2020-12-05T05:41:28+05:30 IST