రాజస్థాన్‌లో బోరుబావిలో పడిన బాలుడు

ABN , First Publish Date - 2021-05-07T12:36:28+05:30 IST

రాజస్థాన్ రాష్ట్రంలోని జాలోర్ జిల్లాలోని లాచ్రీ గ్రామంలో నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ 90 అడుగుల లోతున్న బోరుబావిలో పడ్డాడు....

రాజస్థాన్‌లో బోరుబావిలో పడిన బాలుడు

సహాయచర్యలు ప్రారంభం

జాలోర్ (రాజస్థాన్): రాజస్థాన్ రాష్ట్రంలోని జాలోర్ జిల్లాలోని లాచ్రీ గ్రామంలో నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తూ 90 అడుగుల లోతున్న బోరుబావిలో పడ్డాడు. అనిల్ దేవాసి అనే నాలుగేళ్ల బాలుడు సజీవంగా ఉండటంతో అధికారులు అతన్ని రక్షించే ప్రయత్నాలు ప్రారంభించారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం, రాష్ట్ర విపత్తు సహాయక బృందాలు చేరుకొని బోర్ వెల్ లోకి కెమెరా కిందకు దించడంతో బాలుడు బోరుబావిలో 90 అడుగుల లోతులో ఉన్నట్లు గుర్తించారు. బాలుడికి ఆక్సిజన్ ను అందిస్తూ నిద్రపోకుండా ఆహారం కూడా పంపించారు. బాలుడి తండ్రి నాగరం దేవాసి పొలంలో రెండురోజుల క్రితం బోరుబావి తవ్వాడని పోలీసులు చెప్పారు. బోరుబావికి కవరు ఉన్నా బాలుడు ఆడుకుంటూ దాన్ని తొలగించాడని పోలీసులు చెప్పారు. 

Updated Date - 2021-05-07T12:36:28+05:30 IST