బ్యాంకులకు నాలుగు రోజుల సెలవులు

ABN , First Publish Date - 2021-03-08T05:04:31+05:30 IST

జిల్లావ్యాప్తంగా బ్యాంకులు నాలుగు రోజుల పాటు వరుసగా మూతపడనున్నాయి.

బ్యాంకులకు నాలుగు రోజుల సెలవులు

చిత్తూరు కలెక్టరేట్‌, మార్చి 7: జిల్లావ్యాప్తంగా బ్యాంకులు నాలుగు రోజుల పాటు వరుసగా మూతపడనున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 15, 16 తేదీల్లో బ్యాంకు ఉద్యోగ సంఘాలు రెండు రోజుల సమ్మె చేపట్టనున్నాయి. అలాగే ఈనెల 13న రెండో శనివారం, 14న ఆదివారం కావడంతో బ్యాంకులు వరుసగా నాలుగు రోజులు మూతపడనున్నాయి. కాగా, 10న మున్సిపల్‌ ఎన్నికలు జరిగే ప్రాంతాల్లో ఉన్న బ్యాంకు శాఖలకు సెలవు ప్రకటించారు. మరోవైపు 12న మహాశివరాత్రి సందర్భంగా బ్యాంకుకు సెలవు ఉంటుంది. 

Updated Date - 2021-03-08T05:04:31+05:30 IST