Abn logo
May 14 2021 @ 00:10AM

వర్షాలకు తడిసిన ధాన్యం.. రైతుల గగ్గోలు

తాడేపల్లిగూడెం రూరల్‌, మే 13 :తాడేపల్లిగూడెం మండలంలో కురుస్తున్న వర్షాలకు చేతికి వచ్చిన ధాన్యం తడిసి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొం టున్నారు. ఓ వైప అంతా బాగున్నా ధాన్యం తూసుకునేందుకు మిల్లర్‌లు ముందుకు రాకుండా ఇబ్బంది పెడుతుంటే, మరోవైపు వర్షాలకు ధాన్యం మొత్తం తడిసిపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మం డలంలో మాధవరం, అప్పారావుపేట, ఉప్పరగూడెం, జగన్నాఽథపురం తదితర గ్రామాల్లో తడిసిన ధాన్యం ఆరబెట్టుకునే పనుల్లో రైతులు నిమగ్నమయ్యారు.

Advertisement