అన్నదాతను ఇబ్బందులు పెడితే పతనం తప్పదు

ABN , First Publish Date - 2020-12-01T03:55:35+05:30 IST

అన్నదాతను ఇబ్బందులు పెడితే పతనం తప్పదు

అన్నదాతను ఇబ్బందులు పెడితే పతనం తప్పదు
యాచారంలో దిష్టిబొమ్మను దగ్ధం చేస్తున్న నాయకులు

రైతు సంఘం జిల్లా కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి

యాచారం: అన్నదాతను ఇబ్బందులు పెడితే పాలకులకు పతనం తప్పదని రైతు సంఘం జిల్లా కార్యదర్శి మధుసూదన్‌రెడ్డి అన్నారు ఢిల్లీలో రైతు ల దీక్షకు మద్దతుగా సోమవారం యాచా రం మండల కేంద్రం లో సీపీఎం, రైతు సం ఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్ర భుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు పండించిన పంటలకు తగిన గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా అమలు చేస్తున్న వ్యవసాయ చట్టం కారణంగా రైతుల మనుగడ ప్రశ్నార్థకం కానుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం రైతుల పట్ల మొసలికన్నీరు కారుస్తుందని విమర్శించారు. రైతులు పండించిన పంటలక గిట్టుబాటు ధర కల్పించాలని ఏళ్ల తరబడిగా రైతులు డిమాండ్‌ చేస్తున్నా పాలకులు నిరంకుశంగా వ్యవహరించడం తగదని అన్నారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు పి.బ్రహ్మయ్య, థావునాయక్‌, చంద్రయ్య, దర్మన్నగూడ, నానక్‌నగర్‌, కొత్తపల్లి గ్రామాల  సర్పంచ్‌లు  బాషయ్య, పెద్దయ్య, హబీబొద్దీన్‌, నాయకులు యాదయ్య, శ్రీను. శ్రీశైలం, వెంకటేష్‌, కొత్తపల్లి ఉపసర్పంచ్‌ జగన్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-01T03:55:35+05:30 IST