జగన్ మనసు మార్చుకోవాలి: ప్రత్తిపాటి పుల్లారావు

ABN , First Publish Date - 2022-03-03T17:58:06+05:30 IST

అమరావతి విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు.

జగన్ మనసు మార్చుకోవాలి: ప్రత్తిపాటి పుల్లారావు

గుంటూరు: అమరావతి విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. సీఆర్డీఓ చట్టం ప్రకారం అమరావతిని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. రైతుల త్యాగాలను గుర్తించి సీఎం జగన్ రెడ్డి మనస్సు మార్చుకోవాలని హితవుపలికారు. మరోసారి మూడు రాజధానులు అనే ప్రస్తావన రాకుండా చేసిన తప్పును సరి దిద్దుకోవాలన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాలలో ఏకైక రాజధాని అమరావతి గా ప్రకటన చేయాలని పుల్లారావు డిమాండ్ చేశారు. 


కేంద్రానికి కృతజ్ఞతలు...

కేంద్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా గుర్తించినందుకు ప్రత్తిపాటి పుల్లారావు కృతజ్ఞతలు తెలియాజేశారు. అమరావతిపై కేంద్రం స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలన్నారు. రాజధాని భవనాల నిర్మాణానికి కేంద్రం నిధులు మంజూరు చేయాలని కోరారు. వివేకా హత్యకేసులో దోషులు ఎవరనేది సీబీఐకి, ప్రజలకు పూర్తిగా అర్ధమైందని అన్నారు. సీఎం కుటుంబ సభ్యులే దోషులని రాష్ట్రమంతా కోడైకూస్తున్న వేళ జగన్  ఎందుకు మాట్లాడం లేదని ప్రశ్నించారు. జగనన్న కాలనీల్లో మౌళిక వసతులు కూడా లేదని విమర్శించారు. టీడీపీ హయాంలో నిర్మించిన టిడ్కో ఇళ్ళని లబ్ధిదారులకు వెంటనే అందచేయాలని ప్రత్తిపాటి పుల్లారావు డిమాండ్ చేశారు. 

Updated Date - 2022-03-03T17:58:06+05:30 IST