కుట్రతోనే ఇరికించారు: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

ABN , First Publish Date - 2020-09-29T15:37:38+05:30 IST

కుట్ర పూరితంగానే తనను కేసులో ఇరికించారని మాజీ మంత్రి కొల్లు..

కుట్రతోనే ఇరికించారు: మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

రాష్ట్రంలో అరాచక పాలన

ఎస్సీ, ఎస్టీ, బీసీలను అణగదొక్కేందుకు కుఠిల యత్నాలు

మాజీమంత్రి కొల్లు రవీంద్ర


ఆంధ్రజ్యోతి - మచిలీపట్నం : కుట్ర పూరితంగానే తనను కేసులో ఇరికించారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పనిగట్టుకుని హత్యకేసులో తన పేరును చేర్చడమే కాకుండా పారిపోయినట్లు తనపై పోలీసులతో దుష్ప్రచారం చేయించారన్నారు. పాత కక్షలతోనే మోకా భాస్కరరావు హత్య జరిగిందని పోలీసులు చెప్పారన్నారు. హత్య జరిగిన నాలుగు రోజుల వరకు తన వద్దకు పోలీసులెవరూ రాలేద న్నారు. ఎస్పీ స్థాయి అధికారి తాను పారిపోయినట్లు గా విలేకరులతో చెప్పడం సమంజసంగా లేదన్నారు.


మాజీమంత్రిగా టీడీపీ కార్యకర్తలు, నేతలతో ఫోన్‌లో మాట్లాడతానని, ఇందులో తప్పేముందన్నారు. అలా గే తనకు వ్యాపారాలున్నాయని, అందుకు విశాఖప ట్నంకు వెళ్లివస్తుంటే తునివద్ద పోలీసులు తనకారు ను నిలిపారన్నారు. తమ కుటుంబం ఎటువంటిదో రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. సొంత ఆస్తులు అన్యా క్రాంతమైనా అధికారంలో ఉండి కూడా పోలీసులు, కోర్టులను ఆశ్రయించామే తప్ప దౌర్జన్యాలకు దిగలే దన్నారు. రాష్ట్రంలో అరాచకపాలన కొనసాగుతోం దని, యనమలపై ఎస్సీ, ఎస్టీ కేసు, అయ్యన్నపాత్రు డు, అచ్చెన్నాయుడు, తనపై వివిధ రకాల కేసులు పెట్టి ప్రతిపక్ష నేతలపై కక్షతీర్చుకుంటోందన్నారు.


రాష్ట్రవ్యాప్త ఉద్యమం

టీడీపీ అధినేత చంద్రబాబు అనుమతితో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలపై రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తానని కొల్లు రవీంద్ర అన్నారు. అధికార పక్షం వారు ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలపై దాడులకు పాల్ప డుతున్న నేపథ్యంలో త్వరలో ఈ ఉదంతాలపై ఉద్యమబాట పడతామన్నారు. 

 

టీడీపీని బలోపేతం చేస్తాం

మచిలీపట్నం పార్లమెంటు కమిటీ అధ్యక్షుడిగా ఎంపికైన మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు నాయకత్వంలో పార్టీని బలోపేత చేస్తామన్నారు. రాష్ట్రస్థాయి కమిటీని త్వరలో ప్రకటిస్తారని బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు. 


దైవకృపతో విజయాలు సాధిస్తా

మచిలీపట్నం టౌన్‌ : దైవకృపతో విజయాలు సాధిస్తానని మాజీ మంత్రి  కొల్లు రవీంద్ర అన్నారు. సోమవారం సుల్తానగరం ఆంజనేయ స్వామి దేవా లయం, చిలకలపూడి పాండురంగ స్వామి దేవాల యం, కరగ్రహారం ఫరీద్‌బాబా దర్గా వద్ద నిర్వహిం చిన ప్రత్యేక పూజల్లో కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.  గోపు సత్యనారాయణ, పంచపర్వాల కాశీవిశ్వనాథం, కొట్టె వెంకట్రావు, నేతలు పుప్పాల ప్రసాద్‌, పి.వి.ఫణికుమార్‌, కరెడ్ల సుశీల పాల్గొన్నారు.



Updated Date - 2020-09-29T15:37:38+05:30 IST