చిలుకూరు బాలాజీ ఆలయంలో మిజోరాం మాజీ గవర్నర్‌ పూజలు

ABN , First Publish Date - 2022-08-06T05:30:00+05:30 IST

చిలుకూరు బాలాజీ ఆలయంలో మిజోరాం మాజీ గవర్నర్‌ పూజలు

చిలుకూరు బాలాజీ ఆలయంలో మిజోరాం మాజీ గవర్నర్‌ పూజలు
కుమ్మన్‌ రాజశేఖరన్‌ను సన్మానించి ఆలయచరిత్ర పుస్తకాన్ని అందజేస్తున్న రంగరాజన్‌

మొయినాబాద్‌ రూరల్‌, ఆగస్టు 6: రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌ మండలంలో గల ప్రముఖక్షేత్రం చిలుకూరు బాలాజీని మిజోరాం మాజీ గవర్నర్‌, కేరళలోని శ్రీపద్మనాభస్వామి ఆలయ ఆడ్మినిస్ట్రేటివ్‌ కమిటీలో కేంద్రప్రభుత్వ ప్రతినిధిగా పనిచేస్తున్న బీజేపీ కేరళ నాయకుడు కుమ్మన్‌ రాజశేఖరన్‌ దర్శించుకున్నారు. శనివారం ఆలయానికి వచ్చిన ఆయనకు చిలుకూరు బాలాజీ దేవాలయం ప్రధాన అర్చకుడు సీఎస్‌ రంగరాజన్‌ ఘనస్వాగతం పలికారు. ఈసందర్భంగా కుమ్మన్‌ రాజశేఖరన్‌కు స్వామివారి దర్శనం అనంతరం ఆలయ విశిష్టతను వివరించారు. ఆలయ చరిత్రకు సంబంధించిన పుస్తకాన్ని అందజేశారు. చిలుకూరు బాలాజీ దేవాలయంలోని వేంకటేశ్వరస్వామిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని మాజీ గవర్నర్‌ కుమ్మన్‌ రాజశేఖరన్‌ అన్నారు. ఆలయ విశిష్టత ఎంతో గొప్పగా ఉందని తెలిపారు. రంగరాజన్‌ మాట్లాడుతూ.. శబరిమల తీర్పు తర్వాత హిందూ ఆలయాల్లో దేవతలకు రాజ్యాంగపరమైన హక్కుల కోసం ధర్మ పరిరక్షణకు చిలుకూరు ఆలయం తీసుకున్న ముందస్తు నాయకత్వానికి మాజీ గవర్నర్‌ అభినందనలు తెలిపారని చెప్పారు. తిరువనంతపురంలోని జటాయి పారా వద్ద వెయ్యి మెట్ల నిర్మాణానికి కృషి చేస్తున్న ఆయనకు చిలుకూరు వేదికగా ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు శ్రీరాములు, సహదేవ్‌ గౌడ్‌, రాజమల్లేష్‌, యాదగిరి ముదిరాజ్‌, రాజు, గోపీకాంత్‌, ఎల్లే్‌షగౌడ్‌ ఉన్నారు.

Updated Date - 2022-08-06T05:30:00+05:30 IST