Advertisement
Advertisement
Abn logo
Advertisement

బండాయప్ప మఠాధిపతిని కలిసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి

బిచ్కుంద, అక్టోబరు 14: బిచ్కుందలోని బండాయప్ప మఠసంస్థాన్‌ మఠాధిపతి సోమలింగ శివాచార్యులను గురువారం మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత రోడ్డు భవనాల శాఖ మంత్రి అశోక్‌ చౌహాన్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. మహారాష్ట్ర లోని నాందేడ్‌ జిల్లా దెగ్లూర్‌ ఎమ్మెల్యే రావుసాహెబ్‌ అంతాపూర్‌కర్‌ కరోనా వల్ల ఇటీవల మృతి చెందా డు. దీంతో ఈ నియోజకవర్గంలో ఉప ఎన్నికలు నిర్వహించారు. అక్టోబరు 30న ఎన్నికలు ఉండడం తో దెగ్లూర్‌లో ఎన్నికల ప్రచార నిమిత్తమై వచ్చిన అశోక్‌ చౌహాన్‌ మఠాధిపతిని మర్యాదపూర్వకంగా కలిసి ఆయన అశీర్వచనాలు పొందారు. ఆయనతో పాటు జుక్కల్‌ మాజీ శాసన సభ్యులు గంగారాం, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు విఠల్‌రెడ్డి, సతీష్‌గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement