కోర్టుకు హాజరు కాకుంటే ఆస్తుల జప్తు.. పోలీసుల వార్నింగ్

ABN , First Publish Date - 2021-11-30T11:58:26+05:30 IST

కోర్టుకు హాజరు కాకుంటే ఆస్తుల జప్తు.. పోలీసుల వార్నింగ్

కోర్టుకు హాజరు కాకుంటే ఆస్తుల జప్తు.. పోలీసుల వార్నింగ్

హైదరాబాద్ సిటీ/పేట్‌బషీరాబాద్‌ : కుత్బుల్లాపూర్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌ పరిధిలో కేసులు నమోదై నాన్‌బెయిలబుల్‌ వారంట్లు జారీ అయినా కోర్టు కు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న నలుగురు వ్యక్తుల ఆస్తులను ఎక్సైజ్‌ శాఖ నింబంధనల ప్రకారం జప్తు చేస్తామ ని సీఐ వెంకటేశం తెలిపారు. ఈ మేరకు సోమవారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా ఐడీఏ బొల్లారానికి చెందిన బాలకృష్ణ, మెదక్‌ జిల్లా పూసంపల్లికి చెందిన ఏ తిరుపతి డిసెంబర్‌ 2లోపు ఎల్బీనగర్‌ కోర్టులో లేదా కుత్బుల్లాపూర్‌ ఎక్సైజ్‌ కార్యాలయంలో లొంగిపోవాలని పేర్కొన్నారు. మెదక్‌ జిల్లా అన్నాసాగర్‌ గ్రామానికి చెందిన ఆర్‌ రాజన్న డిసెంబర్‌ 30 లోపు మేడ్చల్‌ కోర్టులో లేదా కుత్బుల్లాపూర్‌ ఎక్సైజ్‌ కార్యాలయంలో, మేడ్చల్‌ జిల్లా కొంపల్లి గ్రామానికి చెందిన అజయ్‌ నవంబర్‌ 30న మేడ్చల్‌ కోర్టులో లేదా కుత్బుల్లాపూర్‌ ఎక్సైజ్‌ కార్యాలయంలో లొం గిపోవాలని తెలిపారు. లేదంటే వారి ఆస్తులను జప్తు చేస్తామని సీఐ పేర్కొన్నారు.

Updated Date - 2021-11-30T11:58:26+05:30 IST