Abn logo
Sep 21 2020 @ 00:33AM

అడవుల జల్లెడ..సరిహద్దుపై నిఘా

ప్రత్యేక పోలీసు బలగాల కూంబింగ్‌

ఎన్‌కౌంటర్‌తో  అంతా అప్రమత్తం


కోటపల్లి, సెప్టెంబరు 20 :  కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కాగజ్‌నగర్‌ మండలం కదంబా అటవీ ప్రాంతంలో శనివారం రాత్రి జరిగిన ఎన్‌కౌంటర్‌తో జిల్లాలోని మారు మూల పోలీస్‌స్టేషన్‌లోని పోలీసులు అప్రమత్తమయ్యారు. ఉన్న తాధికారు ల ఆదేశాలతో పోలీసులు అడవులను జల్లెడ పడుతున్నారు. ముఖ్యంగా మహారాష్ట్ర సరిహద్దుగా ఉన్న కోట పల్లి, వేమనపల్లి మండలాలలో పోలీ సులు ముమ్మర కూంబింగ్‌ చేపట్టారు. కదంబా ఎన్‌కౌంటర్‌ జరిగిన కొన్ని గంటల్లోనే ప్రత్యేక పోలీసు బలగాలు అడవుల బాటపట్టాయు. ప్రత్యేక పోలీ సు బలగాలు  నాలుగు బృందాలుగా కూంబింగ్‌ నిర్వహిస్తున్నాయి. అడవు లతోపాటు సరిహద్దు తీరం వెంట నిఘా పెంచారు. ప్రాణహిత, గోదావ రి నదుల తీరం పొడవునా పోలీసులు తనిఖీ చేపట్టారు. కదంబా ఎన్‌కౌం టర్‌లో ఇద్దరు మావోయిస్టు సభ్యులు  మృతిచెందగా  తప్పించుకున్న మిగతా మావోయిస్టులు ప్రాణహిత నది దాటుతారనే ఉద్దేశ్యంతో పోలీసులు కూంబింగ్‌ చేపట్టిన ట్లు తెలుస్తోంది.


అంతే కాకుండా ఎదురుకాల్పుల్లో తప్పించుకున్న మావోయిస్టుల్లో ఒకరిద్దరికో గాయాలు అయి ఉంటాయని, వారు మారుమూల గ్రామాల్లో చికిత్సలు చేయించుకుం టారనే అనుమానంతో పోలీసులు సరిహద్దు గ్రామాలతోపాటు సానుభూ తిపరులపై దృష్టి సారించారు. కొత్త వ్యక్తులు ఎవరైనా గ్రామాలకు వచ్చారా, కదలికలు ఏమైనా ఉన్నాయా అనే దానిపై ఆయా గ్రామాల ప్రజల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. మరోవైపు ప్రాణహిత నది ప్రవాహం తగ్గగా ఫెర్రి పాయింట్ల వద్ద నుంచి మావోయిస్టులు పక్క రాష్ట్రం చేరే అవకాశాలున్నట్లు భావిస్తున్న పోలీ సులు గస్తీ ఏర్పాటు చేశారు. ఒక్కో బృందంలో సుమారు 30 మంది పోలీసుల చొప్పున 4 బృందాల్లో 120 మంది ప్రత్యేక పోలీసులు నలువైపుల నుంచి అడుగడుగునా అడవుల్లో కూంబింగ్‌ నిర్వహిస్తున్నారు. కొంత కాలంగా నిశ్శబ్దంగా ఉన్న మారుమూల గ్రామాలు, అడవుల్లో ఒక్కసారిగా పోలీసుల బూట్ల శబ్దం వినిపిస్తుండటంతో  ఎప్పుడు ఏం జరుగుతుందోనని సరిహద్దు గ్రామాల ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. 


కదంబా ఎన్‌కౌంటర్‌పై సమగ్ర విచారణ జరిపించాలి 

బెల్లంపల్లి టౌన్‌ : శాంతియుతంగా ఉన్న తెలంగా ణలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎన్‌కౌంటర్లు చేస్తూ తెలంగా ణలో అశాంతి సృష్టిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే అమురా జుల శ్రీదేవి అన్నారు. తెలంగాణలో మావోయిస్టులు లేరని చెబుతున్న ప్రభుత్వం డీజీపీ మహేందర్‌ రెడ్డితో ఏరియల్‌ సర్వే నిర్వహించిన 18 రోజుల తరువాత కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లాలో ఇద్దరు మావోయిస్టులను ఎన్‌కౌంటర్‌ చేయడం అమానుషమన్నారు. ప్రజలపై ప్రభుత్వం ఫాసిస్టు ధోరణితో వ్యవహరిస్తు కుట్రపూరి తంగా ఎన్‌కౌంటర్లు చేయిస్తోందని ఆమె ఆరోపించారు.   ఈ ఎన్‌కౌం టర్‌ పై సమగ్ర విచారణ జర పాలని ఆమె డిమాండ్‌ చేశారు. 


ఫబంగారు తెలంంగాణ అని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ మావోయిస్టులను కాల్చిచంపుతూ ఆసిఫాబాద్‌ జిల్లాలో రక్తపుటేర్లు పారించారని సీపీఐ మాజీ శాసనసభ పక్షనేత, బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే గుండా మల్లేష్‌ తెలిపారు. కదంబా ఎన్‌కౌంటర్‌పై ఆయన స్పందించారు. పోలీసులు గ్రేహాండ్స్‌, స్పెషల్‌ పార్టీ పోలీసులు ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలో ఉమ్మడి ఆదిలా బాద్‌ జిల్లా అటవీ ప్రాంతాలను చుట్టుముట్టి గిరిజన ప్రాంతాల్లో, మారుమూల గ్రామాల్లో అలజడి సృష్టించి ఎన్‌కౌంటర్‌ పేరుతో ఇద్దరు మావోయిస్టులను కాల్చి చంపారని తెలి పారు. 


శాంతియుతంగా ఉన్న కొమురంభీం, మంచిర్యాల జిల్లాలలో ఈ ఎన్‌కౌంటర్‌తో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఎన్‌కౌంటర్‌పై ఉన్నత స్థాయి విచారణ జరిపించి బాధ్యులైన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement
Advertisement
Advertisement