నిషేధిత తంబాకు పట్టివేత

ABN , First Publish Date - 2020-05-25T08:59:41+05:30 IST

మండలంలోని అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టు ఘన్‌పూర్‌ వద్ద ఆదివారం తెల్లవా రు జామున అక్రమంగా తరలిస్తున్న నిషేధిత తంబాకు (చూరచాప్‌) డబ్బాలను ..

నిషేధిత తంబాకు పట్టివేత

బోథ్‌, మే24: మండలంలోని అంతర్‌రాష్ట్ర చెక్‌పోస్టు ఘన్‌పూర్‌ వద్ద ఆదివారం తెల్లవా రు జామున అక్రమంగా తరలిస్తున్న నిషేధిత తంబాకు (చూరచాప్‌) డబ్బాలను పోలీసు లు స్వాధీనం చేసుకున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి.. మహారాష్ట్రలోని హిమయత్‌నగర్‌ కు చెందిన అమీర్‌ ఖాన్‌ ఇచ్చోడకు చెందిన మాజీద్‌ అనే వ్యాపారికి తంబాకును తరలిస్తున్నారు. ఈ క్రమంలో ఘన్‌పూర్‌ చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాన్ని నిలిపి డ్రైవర్‌ను ప్రశ్నించగా, కిరాణా సామగ్రిని తీసుకెళ్తున్నానని చెప్పాడు. సామగ్రికి సంబంధించిన పత్రాలను చూపించాలని పేర్కొనగా, లేకపోవడంతో వాహనాన్ని తనిఖీ చేశారు. 34 కార్టన్లల్లో ఉన్న రూ.2.76 లక్షల విలువ గల సూర్యచాప్‌ తంబాకు డబ్బాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసుకొని దర్యా ప్తు చేస్తున్నామని సీఐ రవీందర్‌, ఎస్సై రాజులు తెలిపారు. 


 గుట్కా ప్యాకెట్ల పట్టివేత

ఇచ్చోడరూరల్‌: ఇస్లాంపూర్‌ కాలనీకి చెందిన ఎస్‌కే మున్నార్‌ అక్రమంగా గుట్కాను విక్రయిస్తుండగా ఆదివారం అరెస్టు చేసినట్లు ఎస్సై పుల్లయ్య తెలిపారు. 149 గుట్కా ప్యాకె ట్లు స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ రూ.18 వేలు ఉంటుందని తెలిపారు.

Updated Date - 2020-05-25T08:59:41+05:30 IST