Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఫోలేట్‌ కోసం

ఆంధ్రజ్యోతి(25-02-2021)

విటమిన్‌ బి9గా పిలిచే ఫోలిక్‌ ఆమ్లం గర్భస్థ పిండం చక్కగా ఎదిగేందుకు, ఆరోగ్యకరమైన ఎర్రరక్తకణాలు ఉత్పత్తికి ఎంతో అవసరం. ఈ విటమిన్‌ ఎందులో ఎక్కువగా లభిస్తుందంటే...


 ముదురు ఆకుపచ్చ రంగు ఆకుకూరల్లో ఫోలిక్‌ ఆమ్లం సమృద్ధిగా ఉంటుంది. ఈ ఆకుకూరలను తింటే రోజుకు అవసరమైన ఫోలిక్‌ ఆమ్లం అందుతుంది.


 రాజ్‌మా, పచ్చిబఠాణి, ఇతర బీన్స్‌ ఫోలిక్‌ ఆమ్లానికి మంచి ఆహార వనరులు. లెగ్యూమ్‌ జాతి పప్పుధాన్యాలను ఆహారంలో చేర్చుకుంటే ఈ విటమిన్‌ లోపం తలెత్తదు.


 ఒక కప్పు బీట్‌రూట్‌ తింటే రోజుకు అవసరమైన ఫోలేట్‌లో 37 శాతం లభిస్తుంది.


 నారింజ, ద్రాక్ష, నిమ్మ వంటి నిమ్మజాతి పండ్లలో ఫోలిక్‌ ఆమ్లం ఎక్కువగా ఉంటుంది. 


 రోజూ గుడ్డు తింటే అవసరమైన పోషకాలతో పాటు బి9 విటమిన్‌ కూడా దొరకుతుంది. 


 బొప్పాయ, అరటి వంటి పండ్లు కూడా ఫోలిక్‌ ఆమ్లం లోటును భర్తీ చేస్తాయి. 


Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement