చుండ్రు వేధిస్తోందా!

ABN , First Publish Date - 2021-03-31T17:54:35+05:30 IST

జుట్టు నిండుగా, ఆరోగ్యంగా ఉంటే అందం పెరుగుతుంది. పట్టులాంటి కురులు సొంతం అవ్వాలంటే ఇంటి వద్దనే కొబ్బరి నూనెతో తయారుచేసుకున్న కొన్ని హెయిర్‌ మాస్కులు ఉపయోగిస్తే సరి. అవేమిటంటే...

చుండ్రు వేధిస్తోందా!

ఆంధ్రజ్యోతి(31-03-2021)

జుట్టు నిండుగా, ఆరోగ్యంగా ఉంటే అందం పెరుగుతుంది. పట్టులాంటి కురులు సొంతం అవ్వాలంటే ఇంటి వద్దనే కొబ్బరి నూనెతో తయారుచేసుకున్న కొన్ని హెయిర్‌ మాస్కులు ఉపయోగిస్తే సరి. అవేమిటంటే...


కొబ్బరినూనె, రోజ్‌మేరీ ఎసెన్షియల్‌ ఆయిల్‌ రెండూ కలిపిన హెయిర్‌ మాస్కు మాడు పొడిబారకుండా చూస్తుంది.  జుట్టు ఆరోగ్యంగా, పట్టులా మెరిసేలా చేస్తుంది.   

టీ ట్రీ ఎసెన్షియల్‌ ఆయిల్‌, నిమ్మరసం, కొబ్బరి నూనె... ఈ మూడింటితో తయారు చేసుకున్న రాసుకున్న హెయిర్‌ మాస్కు చుండ్రును తగ్గిస్తుంది.  

కొబ్బరినూనె, యాపిల్‌ సిడార్‌ వెనిగర్‌, రోజ్‌మేరీ ఎసెన్షియల్‌ ఆయిల్‌, నీళ్లతో కూడిన హెయిర్‌ మాస్కు కండీషనర్‌లా పనిచేస్తుంది. జుట్టుకు పోషణనిచ్చి ఆరోగ్యంగా పెరగేలా చేస్తుంది. 

రోజ్‌మేరీ ఎసెన్షియల్‌ నూనె, అల్లం రసం, కొబ్బరినూనె హెయిర్‌ మాస్క్‌ కురులను బలంగా చేస్తుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.  కొబ్బరినూనె, షియా బటర్‌, తేనె మిశ్రమం జుట్టుకు డీప్‌ కండీషనర్‌గా పనిచేస్తుంది.

Updated Date - 2021-03-31T17:54:35+05:30 IST