పిల్లల శారీరక ఎదుగుదలకు, మెదడు ఆరోగ్యానికి పోషకాహారం అవసరం. అదే సమయంలో పిల్లలు రకరకాల ఆటలు ఆడేలా చూడాలి. ముఖ్యంగా కొన్ని రకాల ఆటలు మెదడు ఆరోగ్యాన్ని పెంచుతాయి. చురుకుగా మారుస్తాయి. అవేమిటంటే..
డీప్ బ్రీతింగ్ ఎక్సర్‌సైజులతో పాటు తేలికపాటి యోగాసనాలు వేయించాలి.
రోప్ జంపింగ్ వంటి ఆటలు ఆడేలా చూడాలి.
బ్రెయిన్ టీజర్స్, ట్విస్టర్స్ వంటి ఆటలు మెదడును చురుకుగా చేస్తాయి. జ్ఞాపకశక్తిని పెంచుతాయి.
పిల్లలు వయసుకు తగిన విధంగా పజిల్స్ పూరించడం వంటి ఆటలు ఇవ్వాలి. ఇవి పిల్లల్లో కాగ్నిటివ్ స్కిల్స్‌ను పెంచుతాయి.
సెంటర్ ఫర్ డిసీజ్ ప్రివెన్షన్ అండ్ కంట్రోల్ వారు వెల్లడించిన అధ్యయనం వివరాల ప్రకారం మెదడు ఆరోగ్యానికి డ్యాన్స్ బాగా ఉపయోగపడుతుంది. కాబట్టి పిల్లలకు పాటలు వింటూ డ్యాన్స్ చేసేలా ప్రోత్సహించాలి.
కొత్త భాష నేర్చుకునేలా ప్రోత్సహించాలి. ఇది కూడా మెదడు ఆరోగ్యానికి ఉపకరిస్తుంది.